Telegram Join My Telegram   WhatsApp Join My WhatsApp

Expensive క్రీములు వాడడం అవసరం లేదు – Vitamin C తో సహజ గ్లో(Glow) సాధ్యం!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ Clear, Bright, Young Looking Skin కోరుకుంటున్నారు. కానీ Pollution, sunlight, stress, proper diet లేకపోవడం వల్ల చర్మం మసక బారడం తో, Pigmentation, scars, acne వంటి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చర్మానికి సహజ రక్షణగా పనిచేసే పోషక పదార్థం Vitamin C. ఇది శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్ మాత్రమే కాదు, బ్యూటీ కేర్‌లో కూడా ఎంతో ప్రభావవంతమైన పదార్థం. ఇప్పుడు Vitamin C వల్ల కలిగే Beauty ప్రయోజనాలు, వాడే విధానం, జాగ్రత్తలు అన్నింటిని వివరంగా తెలుసుకుందాం.

1) సహజగ గ్లో(Glow) మరియు బ్రైట్‌నెస్ (brightness)

Vitamin C ఒక శక్తివంతమైన Antioxidant. మన చర్మంలో రోజూ ఏర్పడే Free Radicals ఇది నియంత్రిస్తుంది. ఫ్రీ రాడికల్స్ కారణంగా స్కిన్ డల్‌ గా, నిర్జీవంగా కనిపిస్తుంది. Vitamin C వాడటం వల్ల చర్మానికి సహజ ప్రకాశం వస్తుంది. రెగ్యులర్‌ (Regular)గా వాడితే కొన్ని వారాల్లోనే స్కిన్ టోన్(skin toun) మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఉదయం రూటీన్‌లో Vitamin C Serum వాడితే రోజంతా ఫ్రెష్(fresh) లుక్ ఉంటుంది.

2) పిగ్మెంటేషన్ (Pigmentation) మరియు డార్క్(dark spots) తగ్గింపు.

Acne scars, sun spots, melasma వంటి సమస్యలకు Vitamin C మంచి పరిష్కారం. ఇది Melanin నీ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. Melanin అధికంగా ఉత్పత్తి అయితే చర్మం డార్క్ ప్యాచెస్‌(Patches)గా మారుతుంది. Vitamin C ఈ ప్రక్రియను సద్దు మణిగేలా చేసి Skin tone ను ఈవెన్‌గా మారుస్తుంది. 6–8 వారాలు క్రమంగా వాడితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

3) Anti-aging (యాంటీ ఏజింగ్) ప్రభావం.

వయసు పెరిగేకొద్దీ చర్మంలో కాలాజె న్ ఉత్పత్తి తగ్గుతుంది. కాలాజెన్ అనేది చర్మాన్ని టైట్‌గా, స్మూత్‌గా ఉంచే ప్రోటీన్. Vitamin C కాలాజెన్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల Fine lines, wrinkles తగ్గుతాయి. చర్మం మరింత గట్టిగా, యంగ్‌ గా కనిపిస్తుంది. అందుకే చాలా యాంటీ ఏజింగ్ క్రీములు, సీరమ్స్‌ లో Vitamin C ముఖ్యమైన పదార్థంగా ఉంటుంది.

4) సన్ డ్యామేజ్(sun damage)నుండి రక్షణ.

సూర్యకిరణాల్లోని UV Rays చర్మాన్ని దెబ్బతీస్తాయి. Tanning, sunburn, లాంటివి  ముందస్తు ఉంటాయి వృద్ధాప్యం వంటి సమస్యలు వస్తాయి. Vitamin C  antioxidant పనిచేసి ఈ నష్టాన్ని కొంతవరకు తగ్గిస్తుంది. అయితే ఇది sunscreen బదులుగా కాదు. Vitamin C Serum వాడిన తర్వాత SPF ఉన్న Sunscreen తప్పనిసరిగా వాడాలి.

5) మొటిమల(Pimples) తర్వాత మచ్చలు (Dark spots) తగ్గించడం.

Acne తగ్గిన తర్వాత మిగిలే డార్క్ మార్క్స్ చాలామందికి ఇబ్బంది కలిగిస్తాయి. Vitamin C చర్మాన్ని రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. స్కిన్ సెల్స్ రీన్యువల్ ప్రక్రియ వేగంగా జరిగేలా చేస్తుంది. ఫలితంగా మచ్చలు క్రమంగా తగ్గుతాయి. అదేవిధంగా చర్మం సాఫ్ట్‌గా మారుతుంది.

6) చర్మంలో తేమ నిలుపుదల.

Vitamin C కొన్ని Hyaluronic in formulations Acid వంటి పదార్థాలతో కలిసి వస్తుంది. ఇది చర్మంలో తేమను నిలుపుతుంది. Dry skin ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. చర్మం ప్లంప్‌గా, హెల్తీగా కనిపిస్తుంది.

7) సహజంగా Vitamin C పొందే మార్గాలు.

Vitamin C కేవలం Serum రూపంలోనే కాకుండా ఆహారంలో కూడా తీసుకోవాలి. లోపలి నుండి పోషణ అందితేనే బయట ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది.

Vitamin C అధికంగా ఉండే పండ్లు:

  • నిమ్మకాయ (lemon)
  • కమలపండు (orenge)
  • ఉసిరికాయ (amla)
  • జామపండు (guava)
  • కివి (kiwi)
  • స్ట్రాబెర్రీ (strawberry)

రోజూ ఈ పండ్లను తీసుకుంటే చర్మానికి లోపలి నుంచి పోషణ లభిస్తుంది. ముఖ్యంగా ఉసిరికాయలో Vitamin C చాలా ఎక్కువగా ఉంటుంది.

ఇంట్లోనే చేయగల Vitamin C beauty tips.

1. నిమ్మరసం + తేనె ప్యాక్

ఒక spoon నిమ్మరసం, ఒక spoon తేనె కలిపి ముఖానికి Apply చేయాలి. 10 నిమిషాల తర్వాత కడగాలి. ఇది చర్మాన్ని Bright చేస్తుంది. (If you have sensitive skin, do a patch test first..)

2. ఉసిరి పౌడర్ ( indian gooseberry) మాస్క్.

ఉసిరి పౌడర్‌ ను పెరుగు లేదా రోజ్ వాటర్‌ తో కలిపి అప్లై చేయాలి. ఇది Skin tone ను మెరుగుపరుస్తుంది.

3.  కమలం(orenge)తొక్క పూడి .

ఎండ బెట్టిన కమల తొక్క పొడిని బేసన్‌తో కలిపి అప్లై చేయాలి. ఇది Dead Cells తొలగించడంలో సహాయపడుతుంది.

Vitamin C సీరమ్ వాడే సరైన విధానం.

  • ముందుగా Mild cleanser తో ముఖం కడగాలి.
  • Toner వాడాలి.
  • 2–3 డ్రాప్స్ Vitamin C సీరమ్ అప్లై చేయాలి.
  • Moisturizer రాయాలి.
  • ఉదయం అయితే SPF 30 లేదా అంతకంటే ఎక్కువ సన్‌స్క్రీన్ తప్పనిసరి.

10% కాన్సన్‌ట్రేషన్‌తో మొదలుపెట్టి, తరువాత అవసరమైతే 15% లేదా 20% వరకు పెంచవచ్చు.

జుట్టుకు దొరికే Vitamin C ప్రయోజనాలు.

Vitamin C తల చర్మంలో Blood circulation మెరుగుపరుస్తుంది.  hair follicles పోషణ అందుతుంది. అలాగే Dandruff తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మరసం కొద్దిగా కొబ్బరి నూనెలో కలిపి తలకు మర్దన చేయవచ్చు (వారం లో ఒకసారి మాత్రమే).

జాగ్రత్తలు:

సీరమ్ వాడినప్పుడు Slight rustling రావచ్చు, అది సాధారణం.
ఎక్కువ Irritation ఉంటే వాడడం ఆపాలి.
సీరమ్‌ ను చల్లని, చీకటి ప్రదేశంలో ఉంచాలి.
గర్భిణీలు లేదా చర్మ సమస్యలున్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి.

చివరి మాట,

Vitamin C అనేది సహజంగా చర్మానికి Glow 🌟, Young Look, Even Skin Tone ఇవ్వగల అద్భుత పోషక పదార్థం. సరైన పద్ధతిలో వాడితే కొద్ది వారాల్లోనే స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. బయట నుంచి సీరమ్ రూపంలో, లోపలి నుంచి ఆహారం రూపంలో తీసుకుంటే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.

Skin care గురించి మరింత తెలుసుకోవడానికి ఇది చదవండి. 👇

ముఖంపై మొటిమలు రావడానికి అసలు కారణం ఇదే! మీరు చేస్తున్న పొరపాటు ఏంటి?

డిస్క్లైమర్ (Disclaimer):

ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం సాధారణ అవగాహన మరియు విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇందులో పేర్కొన్న Vitamin C Beauty tips, face packs, serums వాడకం వంటి సూచనలు ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా పని చేయక పోవచ్చు. ప్రతి వ్యక్తి చర్మ స్వభావం (Dry, Oily, Sensitive, Combination) వేర్వేరుగా ఉంటుంది.

Vitamin C లేదా ఇతర పదార్థాలను ముఖానికి అప్లై చేసే ముందు తప్పనిసరిగా Patch test చేయాలి. Sensitive skin, allergies, severe acne, eczema, psoriasis వంటి చర్మ సమస్యలు ఉన్నవారు Dermatologist (చర్మ వైద్యుడు) సలహా తీసుకోవడం మంచిది.

గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు లేదా ప్రత్యేకమైన వైద్య పరిస్థితులు ఉన్నవారు కొత్త Skincare products వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. Vitamin C సీరమ్ వాడినప్పుడు Slight irritation సాధారణం అయినా, తీవ్రమైన కాలిపోవడం, ఎర్రబారడం, అలర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వాడకాన్ని ఆపి వైద్యుడిని సంప్రదించాలి.

ఇక్కడ సూచించిన హోమ్ రెమెడీస్ (నిమ్మరసం, ఉసిరి మొదలైనవి) సహజమైనవైనా, అధికంగా లేదా తప్పుగా వాడితే చర్మానికి హానికరమవచ్చు. సూర్యరశ్మిలోకి వెళ్లే ముందు సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి.

ఈ సమాచారాన్ని వైద్య నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయంగా భావించకండి. మీ చర్మానికి అనుకూలమైన చికిత్స కోసం ఎప్పుడూ అర్హత కలిగిన వైద్య నిపుణుల సలహా తీసుకోండి.

ఆరోగ్యం మహాభాగ్యం..

Leave a Comment