Telegram Join My Telegram   WhatsApp Join My WhatsApp

ముఖంపై మొటిమలు రావడానికి అసలు కారణం ఇదే! మీరు చేస్తున్న పొరపాటు ఏంటి?

ఈ రోజుల్లో ముఖంపై మొటిమలు (Pimples / Acne) రావడం చాలా సాధారణ సమస్యగా మారిపోయింది. చిన్న వయసు పిల్లల నుంచీ, యువత వరకు, కొన్నిసార్లు మధ్య వయస్సు వారికీ కూడా ఈ సమస్య ఎదురవుతోంది. చాలామంది దీనిని. “teenage ”లేదా ” hormones” అని సరిపెట్టుకుంటారు. కానీ నిజానికి మన రోజువారీ జీవనశైలి, ఆహార అలవాట్లు, చర్మ సంరక్షణలో చేసే చిన్న చిన్న పొరపాట్లే మొటిమలకు అసలు కారణం అని skin specialist చెబుతున్నారు. ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వస్తుంది?

1. చర్మ రంధ్రాలు మూసుకు పోవడమే మొటిమల మొదటి దశ.

మన చర్మంలో సహజంగా ఆయిల్ (oil) ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని dry అవకుండ కాపాడుతుంది.
-కానీ,
*అధిక ఆయిల్ ఉత్పత్తి
*dry skin cells
*దుమ్ము, కాలుష్యం, మరియు మేకప్ క్రీములు
ఇవి అన్నీ కలిసినప్పుడు చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి.

అప్పుడు లోపల బ్యాక్టీరియా పెరిగి వాపు ఏర్పడి మొటిమలు, Blackheads, Whiteheads వస్తాయి. ఇదే మొటిమల సమస్యకు ప్రారంభం.

2. హార్మోన్లు మాత్రమే కాదు – జీవనశైలి కూడా కారణమే.

హార్మోన్ల మార్పుల వల్ల మొటిమలు రావడం నిజమే. ముఖ్యంగా:
Puberty , Teenage వయసులో.
*నెలసరి ముందు మహిళల్లో
*గర్భం దాల్చిన సమయంలో
*అధిక ఒత్తిడి (Stress) ఉన్నప్పుడు.

ఈ సమయాల్లో ఆయిల్ ఉత్పత్తి ఎక్కువగా పెరుగుతుంది.
కానీ సరైన Skin care లేకపోతేనే మొటిమలు ఎక్కువగా బయటపడతాయి.
హార్మోన్లు కారణం ఒక పక ఐతే, మన అలవాట్లు పరిస్థితిని మరింత చెడగొడతాయి.

3. మీరు చేస్తున్న అతి పెద్ద పొరపాటు
*మొటిమలను పిండడం
ముఖంపై మొటిమ వస్తే చాలామందికి సహజంగా దాన్ని పిండేస్తారు . ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు.
చేతులు మారి గోర్లలో ఉన్న బ్యాక్టీరియా మొటిమలోకి వెలి
Infection ఎక్కువ అవుతుంది.

మొటిమ మానిన తర్వాత కూడా Black spots, Scars వస్తాయి
ఒక్కసారి ఏర్పడిన స్కార్స్ తొలగించడం చాలా కష్టం. కాబట్టి మొటిమలను పిండడం పూర్తిగా మానుకోవాలి.

4. ముఖాన్ని ఎక్కువసార్లు తాకడం –
తెలిసి తెలియని శత్రువు
చాలామంది గమనించరు కానీ
ఫోన్ మాట్లాడుతుంటే ముఖానికి తాకడం
ఆలోచనలో ఉన్నప్పుడు చెంపపై చేయి పెట్టుకోవడం
చెమట వచ్చినప్పుడు కాలి చేతులతోనే తీసుకోవడం
ఇలాంటి అలవాట్ల వల్ల చేతులపై ఉన్న దుమ్ము, బ్యాక్టీరియా ముఖానికి చేరి మొటిమలను పెంచుతాయి.

5. తప్పు ఆహారపు అలవాట్లు.
మీరు తినే ఆహారం మీ చర్మంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది.
ఎక్కువగా నూనెతో చేసిన ఆహారం
జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్
బేకరీ ఐటమ్స్
అధిక చక్కెర, సాఫ్ట్ డ్రింక్స్
ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెంచి మొటిమలను తీవ్రంగా చేస్తాయి. అలాగే నీరు తక్కువగా తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు పోకుండా చర్మంపై ప్రభావం చూపిస్తాయి.

6. తప్పు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడటం.
మొటిమలు తగ్గాలనే ఉద్దేశంతో చాలామంది తప్పు ప్రోడక్ట్స్ వాడతారు.
ఆయిలీ స్కిన్ ఉన్నవారు హెవీ క్రీమ్స్ వాడటం
ఎక్కువ కెమికల్స్ ఉన్న ఫేస్ వాష్‌లు
రోజుకు 4–5 సార్లు ముఖం కడగడం
ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. దీనిని సరిచేయడానికి చర్మం మరింత ఆయిల్ ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా మొటిమలు ఇంకా పెరుగుతాయి.

7. నిద్రలేని & మానసిక ఒత్తిడి.
*ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొనే పెద్ద సమస్య నిద్ర లేకపోవడం
*రోజుకు 7 గంటల కన్నా తక్కువ నిద్ర పోవడం
*రాత్రివేళ మొబైల్ ఎక్కువగా వాడటం late గా పడుకోవడం
*ఎల్లప్పుడూ ఒత్తిడి, Tension లో ఉండటం
ఇవి శరీరంలోని Hormones నీ అసమతుల్యం చేసి మొటిమలకు కారణమవుతాయి.

8. Pimples తగ్గాలంటే ఏం చేయాలి?
– రోజుకు రెండు సార్లు మీరు వాడుతున సబ్బు తో ముఖం కడగాలి
-ముఖాన్ని చేతులతో తాకడం తగ్గించాలి
– మొటిమలను పిండ కూడదు
– రోజుకు కనీసం 2–3 లీటర్ల నీరు తాగాలి
– ఆకుకూరలు, పండ్లు, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలి
– సరిపడ మంచి నిద్ర చేయాలి
– ఒత్తిడిని నియంత్రించడానికి యోగా, నడక (Walking) చేయవచ్చు.

ముఖంపై మొటిమలు రావడానికి ఒక్క కారణం లేదు. మన ఆహారం, నిద్ర, ఒత్తిడి, Skin care – ఇవన్నీ కలిసే ఈ సమస్యను సృష్టిస్తాయి. Hormones నీ మాత్రమే నిందించకుండా, మనం రోజూ చేస్తున్న చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటే మొటిమల సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.
* క్రమంగా, ఓపికతో చర్మాన్ని చూసుకుంటే ముఖం మళ్లీ సహజంగా కలిగే మార్పులను మీరు చూడగలరు..

ఆరోగ్యం మహాభాగ్యం.

Leave a Comment