Telegram Join My Telegram   WhatsApp Join My WhatsApp

Low BP చిన్న సమస్య కాదు! నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం – High BPతో పోల్చి చెప్పిన డాక్టర్ల నిజం ఇదే.!

మన శరీర ఆరోగ్యాన్ని నిర్ణయించే ముఖ్యమైన సూచనలో రక్తపోటు (Blood Pressure – BP) ఒకటి. చాలామంది High BP గురించే భయపడతారు. కానీ నిజానికి Low BP అంతకన్నా  ప్రమాదకరం అనే విషయాని చాలామందికి తెలుసుకోవట్లేదు. ఈ రెండు పరిస్థితులు నిర్లక్ష్యం చేస్తే గుండె, మెదడు, కిడ్నీ ల పై కూడా  తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది.

రక్తపోటు 90/60 mmHg కంటే తక్కువగా ఉంటే దాన్ని Low Blood Pressure (Hypotension) అంటారు. ఐతే
ఇది కొందరిలో సహజంగానే ఉండొచ్చు. కానీ ఎక్కువ మందిలో ఇది శరీరంలో ఏదో తెలియని లోపాన్ని చూపిస్తుంది.

అసలు Blood Pressure(bp) అంటే ఏమిటి?

మన గుండె ప్రతి నిమిషానికి రక్తాన్ని శరీరమంతా పంపేటప్పుడు రక్తనాళాలపై పడే ఒత్తిడినే రక్తపోటు అంటారు.


దీనిని రెండు సంఖ్యలుగా విభజించారు:
Systolic BP (పై సంఖ్య) – గుండె కొట్టుకునేప్పుడు చూస్తారు
Diastolic BP (కింది సంఖ్య) – గుండె విశ్రాంతిలో ఉన్నప్పుడు చూస్తారు.( Up and down )
సాధారణంగా 120/80 mmHg ఉంటే నార్మల్‌ (normal) గా భావిస్తారు.

Low BP లక్షణాలు (important)

Low BP ఉన్నవారిలో కనిపించే లక్షణాలు.:

  • తరచూ తల తిరగడం
  • కళ్ల ముందు చీకటి కనిపించడం
  • శరీరంలో బలహీనత ఉన్నట్టు అనిపించడం
  • మూర్చ రావడం
  • చల్లని చెమటలు పడటం
  • గుండె వేగంగా కొట్టుకోవడం
  • ఏకాగ్రత లేకపోవడం

👉 ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి .చేస్తే అకస్మాత్తుగా పడిపోవడం వల్ల ప్రమాదాలు జరిగే పరిస్థితి ఎకువుగ్ ఉంటుంది.

Low BP ఎందుకు ప్రమాదకరం?

Low BP ఉన్నప్పుడు శరీరంలోని ముఖ్యమైన అవయవాలకు సరిపడా రక్తం చేరదు.

దాని వల్ల:

  • మెదడు(brain) ఆక్సిజన్ సప్లయ్ తగ్గిపోతుంది
  • గుండె సరిగా పనిచేయదు
  • షాక్‌(Shock) కి వెళ్లే అవకాశం
  • అకస్మాత్తుగా పడిపోవడం వల్ల గాయాలు

వృద్ధులు, గర్భిణీలు, షుగర్ ఉన్నవారికి Low BP మరింత ప్రమాదకరం.

Low BP రావడానికి కారణాలు. 👇

  • శరీరంలో నీటి లోపం (Dehydration)
  • రక్తహీనత (Hemoglobin) తకువుగా ఉండడం
  • ఎక్కువ సేపు ఆకలితో ఉండటం
  • హార్ట్(heart)సమస్యలు
  • Sugar లేదా BP మందుల Side Effects
  • ఎక్కువ వేడి వాతావరణం వలన
  • గర్భధారణ సమయం లో  కూడా

Low BP నియంత్రించడానికి పరిష్కారాలు(tips).

ఆహార మార్పులు:

  1. రోజూ తగినంత నీరు తాగాలి
  2. ఉప్పు పరిమాణం డాక్టర్ లా సలహాతో కొంచెం పెంచుకోవచ్చు
  3. ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి (పాలకూర, బీట్‌రూట్, ఖర్జూరం,Ex)
  4. చిన్న చిన్న భోజనాలు తరచూ తింటు ఉండాలీ

జీవనశైలి చేయవలసిన మార్పులు:

  1. అకస్మాత్తుగా లేవకుండా నెమ్మదిగా లేవాలి
  2. ఎక్కువసేపు నిల్చోకుండా ఉండాలి
  3. తల తిరిగితే వెంటనే కూర్చోవాలి
  4. తగినంత విశ్రాంతి తీసుకోవాలి

మందులు(tablets) అవసరమా?

Low BP ఎక్కువగా ఉండి రోజువారీ జీవితం పై ప్రభావితం చేస్తే డాక్టర్ సూచించినట్టు మందులు తప్పనిసరి.
స్వయంగా సొంత నిర్ణయంతో మందులు వాడటం ప్రమాదకరం.

High BP గురించి కూడా చినగా ఒక సూచన .

High BP కూడా ప్రమాద కారమే. కానీ Low BP లాగే ఇది కూడా మొదట్లో లక్షణాలు చూపించదు.
అందుకే రెండింటినీ క్రమం తప్పకుండా చెక్ చేయించుకోవడం చాలా ముఖ్యం.

Conclusion.

Low BP చిన్న సమస్య కాదు.
లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన ఆహారం, జీవనశైలి మార్పులు, డాక్టర్ సలహాతో మందులు వాడితే Low BP ని పూర్తిగా నియంత్రించవచ్చు. ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది – నిర్లక్ష్యం చేయకండి.

ఆరోగ్యం తెలుగు..

Leave a Comment