Telegram Join My Telegram   WhatsApp Join My WhatsApp

Heart Attack Detection Tests for Men: 30 తర్వాత వచ్చే Heart Attack ని ముందే గుర్తించగల కీలక పరీక్షలు.

ఈ రోజుల్లో Heart attack అనేది పెద్ద వయస్సులో మాత్రమే వచ్చే సమస్య కాదు. ప్రస్తుతం 30–40 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న పురుషుల్లో కూడా heart attack కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. జీవనశైలి మార్పులు, ఒత్తిడి, అనారోగ్యకర ఆహారం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల హృదయ సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన World Health Organization (WHO) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 19.8 మిలియన్ మంది హృదయ సంబంధ వ్యాధుల వల్ల మరణిస్తున్నారు. ఈ మరణాల్లో దాదాపు 85% కేసులు హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ వల్లనే జరుగుతున్నాయి. ఈ గణాంకాలు హృదయ ఆరోగ్యం ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే — Heart attack అనేది ఒక్కసారిగా వచ్చే సమస్య కాదు. చాలా సందర్భాల్లో శరీరం ముందుగానే కొన్ని హెచ్చరిక సంకేతాలు ఇస్తుంది. అలాగే కొన్ని మెడికల్ పరీక్షలు కూడా భవిష్యత్తులో హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడంలో సహాయపడతాయి.

కాబట్టి 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి పురుషుడు కొన్ని ముఖ్యమైన స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవడం చాలా అవసరం. ఈ పరీక్షలు గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడమే కాకుండా, భవిష్యత్తులో వచ్చే ప్రమాదాలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.
ఈ నేపథ్యంలో ప్రముఖ Cardiologist Dr Jagjeet Deshmukh చెప్పిన ప్రకారం, 30 సంవత్సరాల తర్వాత పురుషులు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పరీక్షలు ఉన్నాయి.

Heart attack ప్రమాదాన్ని ముందుగానే గుర్తించే ముఖ్య పరీక్షలు.

1. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ (Lipid Profile Test)

హార్ట్ అటాక్ ప్రమాదాన్ని అంచనా వేయడానికి అత్యంత ముఖ్యమైన పరీక్షల్లో లిపిడ్ ప్రొఫైల్ ఒకటి. ఈ పరీక్ష ద్వారా రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిలను తెలుసుకోవచ్చు.

ఈ టెస్ట్ ద్వారా ప్రధానంగా తెలుసుకునే అంశాలు:

  • టోటల్ కొలెస్ట్రాల్
  • LDL (Bad cholesterol)
  • HDL (Good cholesterol)
  • Triglycerides

రక్తంలో LDL కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. దీని వల్ల ఆర్టరీలు క్రమంగా బ్లాక్ అవుతాయి. ఈ పరిస్థితిని అథిరోస్క్లెరోసిస్ అంటారు. ఇది హార్ట్ అటాక్‌కు ప్రధాన కారణంగా మారుతుంది.

అందుకే 30 ఏళ్లు దాటిన తర్వాత కనీసం సంవత్సరానికి ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

2. బ్లడ్ ప్రెషర్ చెక్ (Blood Pressure Test)

హై బ్లడ్ ప్రెషర్‌ను “సైలెంట్ కిల్లర్” అని కూడా అంటారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో దీనికి స్పష్టమైన లక్షణాలు కనిపించవు.

అధిక రక్తపోటు ఉంటే:

  • హృదయంపై అధిక ఒత్తిడి పడుతుంది
  • రక్తనాళాలు బలహీనపడతాయి
  • హార్ట్ అటాక్ ప్రమాదం పెరుగుతుంది

సాధారణంగా ఆరోగ్యకరమైన Blood pressure 120/80 mmHg వద్ద ఉండాలి. ఇది దీర్ఘకాలం అధికంగా ఉంటే గుండె సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.

3. Fasting Blood షుగర్ మరియు HbA1c టెస్ట్

డయాబెటిస్ ఉన్న వ్యక్తుల్లో హార్ట్ అటాక్ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే రక్తనాళాలు దెబ్బతింటాయి.

  • ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ ద్వారా:
    •     * రక్తంలో చక్కెర స్థాయిలు తెలుసుకోవచ్చు
  • HbA1c టెస్ట్ ద్వారా:
    •     *గత 3 నెలల సగటు బ్లడ్ షుగర్ స్థాయిలు తెలుసుకోవచ్చు

ఈ రెండు పరీక్షలు కలిసి డయాబెటిస్ ఉన్నదా లేదా అని తెలుసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

డయాబెటిస్ ఉన్న వ్యక్తుల్లో హార్ట్ అటాక్ ప్రమాదం 2 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని పరిశోధనలు చెబుతున్నాయి.

4. High sensitivity C-Reactive Protein (hs-CRP) Test

ఈ పరీక్ష చాలా మందికి తెలియని కానీ చాలా ముఖ్యమైనది. hs-CRP టెస్ట్ శరీరంలో ఉన్న ఇన్‌ఫ్లమేషన్ స్థాయిని గుర్తించడంలో సహాయపడుతుంది.

ఇన్‌ఫ్లమేషన్ అంటే శరీరంలో ఉండే అంతర్గత వాపు. ఇది రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది.

ఈ పరీక్ష ద్వారా:

  1. రక్తనాళాల్లో వాపు ఉందా లేదా తెలుసుకోవచ్చు
  2. హార్ట్ అటాక్ ప్రమాదాన్ని అంచనా వేయవచ్చు

hs-CRP స్థాయిలు ఎక్కువగా ఉంటే భవిష్యత్తులో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

5. ECG (Electrocardiogram)

ECG అనేది గుండె పనితీరును అంచనా వేసే సాధారణమైన కానీ చాలా ముఖ్యమైన పరీక్ష.

ఈ పరీక్ష ద్వారా:

  1. గుండె కొట్టుకునే రిథమ్ తెలుసుకోవచ్చు
  2. హార్ట్ రిథమ్ లో సమస్యలు ఉన్నాయా తెలుసుకోవచ్చు
  3. గుండె కండరాలపై ఒత్తిడి ఉందా తెలుసుకోవచ్చు

కొన్ని సందర్భాల్లో “Silent heart problems” కూడా ECG ద్వారా గుర్తించవచ్చు.
ఈ పరీక్ష పూర్తిగా నొప్పి లేకుండా చేయబడుతుంది మరియు కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుంది.

6. TMT (Treadmill Test)

TMT టెస్ట్ ప్రధానంగా గుండె వ్యాయామ సమయంలో ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఈ పరీక్షలో:
1) ట్రెడ్‌మిల్ పై నడవాలి లేదా పరుగెత్తాలి
2) అదే సమయంలో గుండె స్పందనలను పరిశీలిస్తారు

ఈ పరీక్ష ద్వారా:
1) గుండెకు సరైన రక్తప్రసరణ ఉందా
2) వ్యాయామ సమయంలో గుండెపై ఒత్తిడి ఎలా ఉందో తెలుసుకోవచ్చు

కుటుంబంలో Heart disease history ఉన్నవారు, ఎక్కువ బరువు ఉన్నవారు లేదా పొగ త్రాగే అలవాటు ఉన్నవారికి ఈ పరీక్షను వైద్యులు సిఫారసు చేస్తారు.

7. ఎకోకార్డియోగ్రామ్ (Echocardiogram)

ఎకోకార్డియోగ్రామ్ అనేది అల్ట్రాసౌండ్ ఆధారంగా చేసే పరీక్ష. ఇది గుండె నిర్మాణం మరియు పనితీరును వివరంగా చూపిస్తుంది.

ఈ పరీక్ష ద్వారా తెలుసుకునే విషయాలు:

1) గుండె కండరాల పనితీరు
2) వాల్వ్ సమస్యలు
3) గుండె పంపింగ్ సామర్థ్యం

హార్ట్ ఫెయిల్యూర్ లేదా ఇతర హృదయ సమస్యలను గుర్తించడంలో ఈ పరీక్ష చాలా ఉపయోగపడుతుంది.

Heart attack కు ముందు కనిపించే హెచ్చరిక సంకేతాలు.!

హార్ట్ అటాక్‌కు ముందు కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు.

ప్రధాన లక్షణాలు:

  • ఛాతిలో ఒత్తిడి లేదా నొప్పి
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • భుజం లేదా చేతిలో నొప్పి
  • ఎక్కువగా చెమటలు పట్టడం
  • వాంతులు లేదా వికారం

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Heart attack గురించి మరికొంత తెలుసుకోవడానికి దీన్ని చదవండి 👇.

HEART ATTACK – చాలామంది గుర్తించకుండా వదిలేస్తున్న ప్రమాదకర లక్షణాలు.

ఆరోగ్యం మహాభాగ్యం .

Leave a Comment