మహిళల శరీరానికి సంబంధించిన సహజ ప్రక్రియల్లో అత్యంత ముఖ్యమైనది Menstruation (Periods). ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మహిళలు ప్రతి నెలా ఈ ప్రక్రియను అనుభవిస్తారు. అయితే, ఇది పూర్తిగా సహజమైన జీవశాస్త్ర ప్రక్రియ అయినప్పటికీ ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో దీని గురించి మాట్లాడటం ఒక తప్పులాగా లాగా భావిస్తారు. అనేక కుటుంబాల్లో, సమాజాల్లో పీరియడ్స్ గురించి ఓపెన్ గా మాట్లాడరు. ఫలితంగా పలు అపోహలు, భయాలు మరియు తప్పుదారులు మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.
పీరియడ్స్ అంటే మహిళ శరీరంలో జరిగే Hormonal cycle లో భాగమైన సహజ ప్రక్రియ. గర్భాశయం ప్రతి నెలా గర్భధారణ కోసం సిద్ధమవుతుంది. కానీ గర్భధారణ జరగకపోతే, గర్భాశయంలో ఏర్పడిన పొర బయటకు వస్తుంది. ఈ ప్రక్రియనే Menstruation అని అంటారు. సాధారణంగా ఇది 21 నుండి 35 రోజుల మధ్యలో ఒకసారి జరుగుతుంది మరియు 3 నుంచి 7 రోజుల వరకు కొనసాగుతుంది.
అయితే పీరియడ్స్ గురించి సమాజంలో చాలా కాలంగా అనేక అపోహలు ప్రచారం అవుతున్నాయి. కొన్ని చోట్ల మహిళలను ఈ సమయంలో వేరుగా ఉంచడం, కొన్ని పనులు చేయనివ్వకపోవడం, దేవాలయాలకు వెళ్లనివ్వకపోవడం వంటి సంప్రదాయాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వైద్య నిపుణులు మాత్రం ఈ అపోహలు మహిళల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.
Gynecologists ప్రకారం, మెన్స్ట్రుయేషన్ గురించి సరైన శాస్త్రీయ అవగాహన ఉండటం చాలా అవసరం. సరైన సమాచారం లేకపోతే మహిళలు తమ శరీరంలో జరిగే మార్పులను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా అవసరమైనప్పుడు వైద్య సహాయం తీసుకోవడంలో కూడా ఆలస్యం జరగవచ్చు.
ఈ నేపథ్యంలో పీరియడ్స్ గురించి సమాజంలో విస్తృతంగా ఉన్న కొన్ని ముఖ్యమైన అపోహలను మరియు వాటి వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలను తెలుసుకోవడం అవసరం.
Menstrual Health ఎందుకు ముఖ్యమైంది?
Menstrual Health అంటే కేవలం పీరియడ్స్ సమయంలో రక్తస్రావం మాత్రమే కాదు. అది మహిళల శరీర ఆరోగ్యాన్ని, హార్మోన్ సమతుల్యతను, ప్రజనన ఆరోగ్యాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన సూచిక. ఒక మహిళకు పీరియడ్స్ సక్రమంగా రావడం అనేది ఆమె శరీరంలో హార్మోన్లు సమతుల్యంలో ఉన్నాయని సూచిస్తుంది.
అయితే పీరియడ్స్ గురించి ఉన్న అపోహలు చాలా సార్లు మహిళల్లో భయం, నెగెటివ్ భావనలు మరియు సిగ్గు భావం కలిగిస్తాయి. ఈ కారణంగా చాలా మంది యువతులు తమ సమస్యలను ఎవరికీ చెప్పకుండా మౌనంగా బాధపడుతుంటారు.
వైద్య నిపుణులు చెబుతున్న దేమిటంటే, పీరియడ్స్ సమయంలో శరీరాన్ని అర్థం చేసుకోవడం, సరైన హైజీన్ పాటించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా అవసరం. పీరియడ్స్ గురించి అవగాహన పెంచడం వల్ల మహిళలు తమ ఆరోగ్యాన్ని మెరుగ్గా చూసుకోవచ్చు.
అలాగే పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి, అలసట, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలను సరైన పద్ధతిలో నిర్వహించవచ్చు. సరైన అవగాహన ఉంటే మహిళలు తమ రోజువారీ జీవితాన్ని సులభంగా కొనసాగించ గలుగుతారు.
Periods గురించి సాధారణంగా ఉన్న అపోహలు మరియు నిజాలు
అపోహ : పీరియడ్స్ సమయంలో వ్యాయామం చేయకూడదు.
సమాజంలో విస్తృతంగా ఉన్న ఒక పెద్ద అపోహ ఏమిటంటే Periods సమయంలో మహిళలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి, ఎలాంటి శారీరక కార్యకలాపాలు చేయకూడదు. చాలా మంది ఈ సమయంలో వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని భావిస్తారు.
నిజం ఏమిటంటే?
వైద్య నిపుణుల ప్రకారం ఇది పూర్తిగా తప్పు అభిప్రాయం. Periods సమయంలో తేలికపాటి వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే. Walking, yoga, stretching వంటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది పీరియడ్స్ సమయంలో వచ్చే Crumps తగ్గించడంలో సహాయపడుతుంది.
వ్యాయామం చేయడం వల్ల శరీరంలో Endorphins అనే Hormones విడుదల అవుతాయి. ఇవి సహజమైన pain killers లాగా పనిచేస్తాయి. ఫలితంగా నొప్పి తగ్గడంతో పాటు మూడ్ కూడా మెరుగుపడుతుంది.
అయితే శరీరం బలహీనంగా అనిపిస్తే తీవ్ర వ్యాయామం చేయకుండా తేలికపాటి కార్య కలాపాలకే పరిమితం కావడం మంచిది.
అపోహ : పీరియడ్స్ సమయంలో స్నానం చేయకూడదు
చాలా కుటుంబాల్లో ఇప్పటికీ ఉన్న ఒక పాత నమ్మకం ఏమిటంటే పీరియడ్స్ సమయంలో మహిళలు స్నానం చేయకూడదు. కొందరు స్నానం చేస్తే రక్తస్రావం పెరుగుతుందని లేదా ఆరోగ్యానికి హానికరమని భావిస్తారు.
నిజం ఏమిటంటే.?
వైద్య నిపుణులు ఈ అపోహను పూర్తిగా ఖండిస్తున్నారు. పీరియడ్స్ సమయంలో స్వచ్ఛతను పాటించడం చాలా ముఖ్యమైన విషయం. స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రంగా ఉండటంతో పాటు Infections ప్రమాదం తగ్గుతుంది.
warm water తో స్నానం చేయడం వల్ల శరీర కండరాలు రిలాక్స్ అవుతాయి. ఇది పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరం తాజాగా అనిపించి మానసికంగా కూడా రిలీఫ్ కలుగుతుంది.
అందువల్ల పీరియడ్స్ సమయంలో స్నానం చేయడం తప్పు కాదు. నిజానికి అది ఆరోగ్యానికి మంచిదే.
అపోహ : పీరియడ్స్ నొప్పిని మౌనంగా భరించాలి
చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో వచ్చే తీవ్రమైన నొప్పిని సహజమైనదిగా భావించి మౌనంగా భరిస్తుంటారు. చాలా కుటుంబాల్లో కూడా “పీరియడ్స్ నొప్పి సహజమే” అని చెప్పి సమస్యను నిర్లక్ష్యం చేస్తారు.
నిజం ఏమిటంటే.?
పీరియడ్స్ సమయంలో స్వల్ప అసౌకర్యం సాధారణం. అయితే తీవ్రమైన నొప్పి, రోజువారీ పనులు చేయలేని స్థాయిలో ఉంటే అది ఒక ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు.
తీవ్రమైన Menstrual Pain కి కారణాలు ఇలా ఉండవచ్చు:
- Endometriosis
- Fibroids
- Pelvic infections
- Hormonal imbalance
ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. సరైన చికిత్స తీసుకుంటే సమస్యను సులభంగా నియంత్రించవచ్చు.
అపోహ : పీరియడ్స్ సమయంలో మహిళలు “అశుద్ధులు”
కొన్ని సంప్రదాయాల్లో ఇప్పటికీ పీరియడ్స్ సమయంలో మహిళలను వేరుగా ఉంచే ఆచారం ఉంది. దేవాలయాలకు వెళ్లనివ్వకపోవడం, వంటగదిలోకి వెళ్లనివ్వకపోవడం వంటి పరిమితులు విధిస్తారు.
నిజం ఏమిటంటే?
శాస్త్రీయంగా చూస్తే పీరియడ్స్ సమయంలో మహిళలు “అశుద్ధులు” అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇది కేవలం పురాతన కాలంలో ఏర్పడిన ఒక సామాజిక నమ్మకం మాత్రమే.
Menstruation అనేది శరీరంలో జరిగే సహజ జీవశాస్త్ర ప్రక్రియ. గర్భధారణ జరగకపోతే గర్భాశయం తన పొరను తొలగించుకునే ప్రక్రియ మాత్రమే.
అందువల్ల మహిళలను ఈ సమయంలో వేరుగా చూడడం సరైనది కాదు. సమాజంలో వారికి సమాన గౌరవం ఇవ్వడం అవసరం.
Periods సమయంలో పాటించాల్సిన ఆరోగ్య సూచనలు..
Menstrual Health ను కాపాడుకోవాలంటే కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి.
- 1. సరైన హైజీన్ పాటించడం
- పీరియడ్స్ సమయంలో ఉపయోగించే సానిటరీ ప్యాడ్లు లేదా మెన్స్ట్రుయల్ కప్పులను క్రమం తప్పకుండా మార్చాలి. దీని వల్ల ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.
- 2. సమతుల్య ఆహారం తీసుకోవడం
- పీరియడ్స్ సమయంలో శరీరానికి ఐరన్, ప్రోటీన్ మరియు విటమిన్లు అవసరం. కాబట్టి ఆకుకూరలు, పండ్లు, గింజలు వంటి పోషకాహారం తీసుకోవాలి.
- 3. తగినంత నీరు తాగడం
- శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. నీరు ఎక్కువగా తాగడం వల్ల అలసట తగ్గుతుంది.
- 4. సరైన విశ్రాంతి తీసుకోవడం
- పీరియడ్స్ సమయంలో శరీరం కొంత బలహీనంగా అనిపించవచ్చు. అందుకే తగినంత నిద్ర మరియు విశ్రాంతి తీసుకోవడం అవసరం.
Menstruation గురించి సరైన అవగాహన పెంచడం సమాజానికి చాలా అవసరం. ముఖ్యంగా యువతులకు చిన్న వయసులోనే ఈ విషయం గురించి స్పష్టమైన సమాచారం ఇవ్వాలి. పాఠశాలలు, కుటుంబాలు మరియు ఆరోగ్య సంస్థలు కలిసి పని చేస్తే ఈ అంశంపై ఉన్న అపోహలు తగ్గుతాయి..
ఆరోగ్యం మహాభాగ్యం.!