Employees’ State Insurance Scheme (ESI) అనేది భారతదేశంలో Private రంగంలో పనిచేసే ఉద్యోగుల కోసం రూపొందించబడిన ఒక ముఖ్యమైన సామాజిక భద్రతా (Social Security) ఆరోగ్య Insurance plan. ఈ పథకం ద్వారా తక్కువ మరియు మధ్యతరగతి వేతన ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు అనారోగ్యం, ప్రమాదాలు, గర్భధారణ వంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా రక్షణ పొందుతారు.
ఈ పథకాన్ని Employees’ State Insurance Corporation (ESIC) అనే స్వయం పాలిత సంస్థ అమలు చేస్తుంది. ఇది Labor మరియు Ministry of Employment ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ESI యొక్క ప్రధాన లక్ష్యం – ఉద్యోగి అనారోగ్యంతో పని చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు అతనికి వైద్య సేవలతో పాటు నగదు ప్రయోజనాలు కూడా అందించడం.
ESI పథకం అవసరం ఎందుకు వచ్చింది?
భారతదేశంలో లక్షలాది మంది private sector లో పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది తక్కువ జీతం పొందే Workers, ఉంటారు చూపాలంటే factory workers,shopping malls, hotels, and small businesses. ఇలాంటి చిన్న రంగం లో పనిచేసేవారు ఉంటారు
ఇలాంటి ఉద్యోగులు అనారోగ్యం బారిన పడితే లేదా ప్రమాదానికి గురైతే, చికిత్స ఖర్చులు భరించడం చాలా కష్టంగా మారుతుంది. ఒకవేళ ఒక పెద్ద Surgery (oparation) చేయించుకోవాలంటే లక్షల రూపాయలు అవసరం అవుతాయి. ఈ ఆర్థిక భారం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ESI పథకాన్ని ప్రారంభించింది.
ఎవరెవరు ఈ పథకానికి అర్హులు?
Eligibility for ESI Scheme ఈ పథకం పొందడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి:
- నెలకు సాధారణంగా ₹21,000 వరకు జీతం పొందే ఉద్యోగులు (వికలాంగులకు ₹25,000 వరకు)
- ESI చట్టం వర్తించే Factories, Companies, shops, Hotels, private companies లో పని చేసే వారు
- సంస్థలో కనీసం 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండాలి (కొన్ని రాష్ట్రాల్లో 20)
అర్హత ఉన్న ఉద్యోగి ESI కింద రిజిస్టర్ అయిన వెంటనే అతనికి మరియు అతని కుటుంబ సభ్యులకు ఆరోగ్య రక్షణ లభిస్తుంది.
Contribution ఎలా ఉంటుంది?
ESI పథకం ఒక Contributory scheme. అంటే ఉద్యోగి మరియు యజమాని ఇద్దరూ కొంత శాతం చెల్లించాలి.
- ఉద్యోగి వాటా – 0.75% (From salary)
- Owner వాటా – 3.25%
ఈ మొత్తం చాలా చిన్నదిగా అనిపించినా, అవసరమైనప్పుడు పెద్ద వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది. ఇది ఉద్యోగికి ఒక భద్రతా కవచంలా పనిచేస్తుంది.
ESI ద్వారా లభించే ముఖ్యమైన ప్రయోజనాలు.
- 1️⃣ పూర్తి ఉచిత వైద్యం
- ESI Hospitals మరియు dispensaries ఉద్యోగి మరియు అతని కుటుంబ సభ్యులకు ఉచిత చికిత్స అందుతుంది. ఇందులో:
- ఔషధాలు( tablets)
- ల్యాబ్ టెస్టులు (lab test)
- స్కానింగ్ (scaning)
- శస్త్రచికిత్సలు (oparation)
- Specialist డాక్టర్ Consultation
- అన్ని సేవలు coverage ఉంటాయి.
- 2️⃣ Sickness బెనిఫిట్.
- ఉద్యోగి అనారోగ్యంతో పని చేయలేకపోతే, అతనికి సుమారు 70% వరకు జీతం నగదు రూపంలో ఇస్తారు. ఇది సాధారణంగా ఒక సంవత్సరంలో 91 రోజుల వరకు లభిస్తుంది.
- 3️⃣ Maternity బెనిఫిట్
- గర్భిణీ స్త్రీలకు పూర్తి జీతంతో సెలవులు అందిస్తారు. సాధారణంగా 26 వారాల వరకు ఈ ప్రయోజనం లభిస్తుంది. ఇది మహిళా ఉద్యోగులకు ఒక గొప్ప సహాయం.
- 4️⃣ Disability బెనిఫిట్
- ప్రమాదం వల్ల శాశ్వత వైకల్యం వస్తే ఉద్యోగికి నెలవారీ పెన్షన్ లభిస్తుంది. ఇది అతని జీవితకాలం పాటు ఉండవచ్చు.
- 5️⃣ Dependents బెనిఫిట్
- ఉద్యోగి పని సమయంలో ప్రమాదంలో మరణిస్తే, అతని కుటుంబ సభ్యులకు నెలవారీ ఆర్థిక సహాయం అందుతుంది.
- 6️⃣ Funeral Expenses బెనిఫిట్
- ఉద్యోగి మరణించినపుడు అంత్యక్రియల కోసం ఒక నిర్దిష్ట మొత్తం అందజేస్తారు.
ESI Hospitals మరియు సేవలు.
దేశవ్యాప్తంగా అనేక ESI Hospitals మరియు Dispensaries ఉన్నాయి. కొన్ని పెద్ద నగరాల్లో ప్రత్యేక Super specialty సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే private tie-up hospitals కూడా చికిత్స పొందే అవకాశం ఉంటుంది.
ఎలా నమోదు(registration) చేసుకోవాలి?
- సంస్థ ESI Registration చేసుకోవాలి
- ఉద్యోగి వివరాలు నమోదు చేయాలి
- ఉద్యోగికి ESI కార్డు (Pehchan Card) జారీ అవుతుంది
- ఆ కార్డు ద్వారా Hospital సేవలు పొందవచ్చు
ESI పథకం ప్రయోజనాలు ఏమిటి?
- తక్కువ premium పెద్ద ఆరోగ్య రక్షణ
- ఉద్యోగికి మరియు కుటుంబానికి భద్రత
- ప్రమాద సమయంలో ఆర్థిక స్థిరత్వం
- గర్భిణీ మహిళలకు ప్రత్యేక రక్షణ
కానీ కొన్ని Limitations ఉంటాయి.
* కొన్ని ప్రాంతాల్లో Hospital సదుపాయాలు తక్కువగా ఉండవచ్చు
* రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల వేచి ఉండాల్సి రావచ్చు(waiting)
అయితే, ఈ చిన్న సమస్యలకంటే అందించే ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
ESI గురించి మరికొని అవగాహనకోసం ఇక్కడ తెలుసుకోండి 👇
చివరిగా .
Employees’ State Insurance Scheme (ESI) అనేది Private sector ఉద్యోగుల కోసం ఒక గొప్ప భద్రతా వ్యవస్థ. చిన్న మొత్తంలో జీతం నుంచి కట్ అయినా, అవసరమైన సమయంలో పెద్ద మొత్తంలో వైద్య సహాయం అందిస్తుంది.
private sector పనిచేసే ప్రతివ్యక్తి అర్హత ఉన్న ఉద్యోగి ఈ పథకాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఇది కేవలం ఒక బీమా పథకం కాదు – ఉద్యోగి కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా.
“మీ ఆరోగ్యం మీ స్వంతం ఆరోగ్యం మహాభాగ్యం”
Disclaimer:
ఈ వ్యాసంలో ఇచ్చిన సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. Employees’ State Insurance Scheme (ESI) కు సంబంధించిన అర్హతలు, ప్రయోజనాలు, జీత పరిమితులు మరియు నిబంధనలు కాలానుగుణంగా మారవచ్చు. అధికారిక మరియు తాజా వివరాల కోసం సంబంధిత Government website లేదా ESIC కార్యాలయాన్ని సంప్రదించాలి. వ్యక్తిగత పరిస్థితులు, ఉద్యోగ నిబంధనలు మరియు సంస్థ పాలసీల ఆధారంగా ప్రయోజనాలు మారవచ్చు. ఈ సమాచారం ఆధారంగా తీసుకునే నిర్ణయాలకు రచయిత లేదా వెబ్‌సైట్ బాధ్యత వహించదు. ఖచ్చితమైన మార్గదర్శకానికి సంబంధిత అధికారులను సంప్రదించడం మంచిది.