Telegram Join My Telegram   WhatsApp Join My WhatsApp

ABHA Health Card vs Ayushman Bharat Card: 5 లక్షల Coverage ఎవరికి.? ఇపుడే తెలుసుకోండి”

ABHA Health Card vs Ayushman Bharat Card: 5 లక్షల Coverage ఎవరికి?

భారతదేశంలో ఆరోగ్య సేవలు వేగంగా Digital మార్గంలోకి మారుతున్నాయి. Government తీసుకొచ్చిన పలు ఆరోగ్య పథకాల వల్ల ప్రజలకు చికిత్స సులభమైంది. అయితే చాలామందికి ఒక పెద్ద సందేహం ఉంది — ABHA Health Card ఉందంటే 5 లక్షల ఉచిత చికిత్స వస్తుందా? లేక అది Ayushman Bharat Card వలన వస్తుందా?

ఈ రెండు పేర్లు ఒకేలా వినిపించినా, వీటి ప్రయోజనం పూర్తిగా వేరు. ఒకటి Digital Health ID కాగా, మరొకటి Health Insurance Scheme. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి, 5 లక్షల coverage నిజంగా ఎవరికీ అందుతుంది, ఎలా పొందాలి అన్నది పూర్తిగా తెలుసుకుందాం.

ABHA Health Card అంటే ఏమిటి?

ABHA అంటే Ayushman Bharat Health Account. ఇది Ayushman Bharat Digital Mission కింద ప్రారంభించబడిన ఒక డిజిటల్ ఆరోగ్య గుర్తింపు సంఖ్య. ప్రతి వ్యక్తికి ఒక 14-digit unique health ID ఇస్తారు.

ఇది insurance card కాదు. ఇది ఒక Digital Health Locker లాంటిది. మీ medical history, prescriptions, lab reports, discharge summaries—ఇవన్నీ digital రూపంలో భద్ర పరచబడతాయి.

ఒకసారి ABHA number తీసుకుంటే, మీరు ఏ hospital కి వెళ్లినా మీ పాత health records doctorతో share చేయవచ్చు. ఇది పూర్తిగా consent-based system. మీ అనుమతి లేకుండా ఎవరూ మీ health data చూడలేరు.

Ayushman Bharat Card అంటే ఏమిటి?

Ayushman Bharat Card అనేది Pradhan Mantri Jan Arogya Yojana (PMJAY) పథకం కింద ఇస్తారు. ఇది ఒక health insurance scheme.

ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి ₹5 లక్షల వరకు inpatient hospital treatment coverage అందుతుంది. అంటే పెద్ద Surgeries, ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సిన సందర్భాల్లో ఖర్చు ప్రభుత్వం భరిస్తుంది.

ఈ card ద్వారా దేశవ్యాప్తంగా empanelled hospitals లో cashless treatment పొందవచ్చు.

ఈ రెండిట్లో ప్రధాన తేడా ఏమిటి ?

ఇద్దరినీ ఒకేలా అనుకోవడం చాలా common mistake. కానీ concept పరంగా వీటి మధ్య పెద్ద తేడా ఉంది.

ABHA:

  • Digital Health ID
  • Medical records storage
  • Paperless healthcare
  • Insurance benefit లేదు

ABHA గురించి మరికొంచం తెలుసుకోండి. 👇

https://abha.abdm.gov.in/abha/v3

Ayushman Bharat (PMJAY):

  • Health Insurance Scheme
  • ₹5 లక్షల వరకు coverage
  • Cashless hospitalization
  • Eligible families కి మాత్రమే

ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే —
5 లక్షల coverage అనేది ABHA వల్ల కాదు. అది PMJAY వల్ల మాత్రమే.

PMJAY gurunchi మరికొంచం తెలుసుకోండి. 👇

https://beneficiary.nha.gov.in/

5 లక్షల Coverage ఎవరికి అందుతుంది ?

₹5 లక్షల coverage అందుకోవడానికి కొన్ని eligibility criteria ఉంటాయి. ఇది universal benefit కాదు. Socio-Economic Caste Census (SECC) data ఆధారంగా eligible families ని ఎంపిక చేస్తారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు, కొన్ని occupational categories లో ఉన్న వారు, urban poor categories — వీరికి ఈ benefit అందుతుంది.

Eligible అయ్యారో లేదో తెలుసుకోవడానికి official PMJAY portal లో check చేయాలి లేదా nearest CSC center వద్ద verify చేయవచ్చు.

ABHA ఎందుకు అవసరం ?

“Insurance ఉన్నప్పుడు ABHA ఎందుకు తీసుకోవాలి?” అని చాలామంది అడుగుతారు.

ABHA వల్ల healthcare seamless అవుతుంది. ఉదాహరణకు:
* మీరు ఒక hospital లో test చేయించుకున్నారు
* ఇంకో city కి shift అయ్యారు
* కొత్త doctor ని consult చేయాలి
ఇప్పుడు పాత reports తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ABHA ID ద్వారా digital records access అవుతాయి.

Long-term లో chronic diseases ఉన్న వారికి ఇది చాలా ఉపయోగకరం. Diabetes, BP, heart conditions వంటి సమస్యలు ఉన్నవారికి regular tracking సులభమవుతుంది.

Digital Healthcare భవిష్యత్తు.

India లో Digital Health ecosystem వేగంగా అభివృద్ధి చెందుతోంది. ABHA వంటి digital IDలు futureలో telemedicine, AI-based diagnosis, wearable health devices integration కి foundation వేస్తాయి.

Health data centralized అవ్వడం వల్ల policy planning, epidemic tracking కూడా వేగంగా జరుగుతుంది.

Pandemic తర్వాత digital healthcare importance ఎంత పెరిగిందో మనందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో ABHA వంటి system చాలా కీలకం.

Cashless Treatment ఎలా జరుగుతుంది ?

PMJAY card ఉన్న వారు empanelled hospitalsలో treatment తీసుకునేటప్పుడు upfront payment చేయాల్సిన అవసరం లేదు.

Hospital directly government portal ద్వారా claim process చేస్తుంది. Patient కి cashless service అందుతుంది.
అయితే outpatient treatments (OPD) అన్ని చోట్ల coverage ఉండకపోవచ్చు. Major surgeries, hospitalization cases లో benefit ఎక్కువగా ఉంటుంది.

 

Frequently Asked Confusions.

చాలామందికి ఉండే కొన్ని సాధారణ సందేహాలు:

ABHA తీసుకుంటే automatically 5 లక్షల insurance వస్తుందా?

లేదు. Insurance benefit PMJAY ద్వారా మాత్రమే.

ABHA mandatory నా ?

లేదు. ఇది voluntary. కానీ future healthcare కోసం useful.

PMJAY card ఉన్నవారికి ABHA అవసరమా ?

Compulsory కాదు. కానీ medical records digitalగా manage చేయాలంటే ఉపయోగకరం.

గ్రామీణ మరియు పట్టణ ప్రజలకు ప్రయోజనాలు.

Rural areas లో medical records track చేయడం కష్టం. Paper documents పోయే ప్రమాదం ఉంటుంది. ABHA వల్ల centralized record management possible అవుతుంది.

Urban population లో frequent job shifts, city changes ఉంటాయి. అప్పుడు digital health ID చాలా helpful అవుతుంది.

PMJAY మాత్రం financially vulnerable familiesకి life-saving scheme అని చెప్పొచ్చు. పెద్ద surgeries సమయంలో huge financial burden తగ్గుతుంది.

మరికొన్ని ఇలాంటి GOVT SCHEME సేవలకోసం కింద చూడండి. 👇👇👇

కేంద్ర ప్రభుత్వం నుంచి గర్భిణీ స్త్రీల కోసం కొత్త పథకం.! -పూర్తి వివరాలు/Pregnant ఉనవలు తెలుసుకోవలసిన సమాచారం.

ఆరోగ్యం మహాభాగ్యం.

Leave a Comment