Telegram Join My Telegram   WhatsApp Join My WhatsApp

Ring of Fire సూర్యగ్రహణం 2026: ఈ అద్భుత దృశ్యం వెనుక శాస్త్రీయ రహస్యం ఏమిటి.? తీసుకోవాల్సిన జాగ్రతలు.!

రేపు జరగబోయే Solar Eclipse / Lunar Eclipse గురించి ఇప్పటికే సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలు, వాట్సాప్ మెసేజ్‌లలో అనేక రకాల సమాచారం వైరల్ అవుతోంది. “గ్రహణం సమయంలో ఏమి తినకూడదా”, “గర్భిణీలు ఎందుకు బయటకు రాకూడదు”, “ఇది ఆరోగ్యానికి ప్రమాదమా” వంటి సందేశాలు చాలామందిలో భయాన్ని కలిగిస్తున్నాయి. కానీ నిజంగా గ్రహణం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా? శాస్త్రం ఏమంటుంది? సంప్రదాయాలు ఎందుకు ఏర్పడ్డాయి? వీటికి ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం.

ఈరోజు, ఫిబ్రవరి 17, 2026న ఏర్పడుతున్న Solar Eclipse ఒక Annular Solar Eclipse, దీనిని సాధారణంగా “ Ring of Fire ” గ్రహణం అని పిలుస్తారు.

ఈ గ్రహణంలో చంద్రుడు భూమి మరియు సూర్యుడి మధ్యకి వస్తాడు. కానీ చంద్రుడు భూమికి కొంచెం దూరంగా ఉండడం వల్ల, సూర్యుడిని పూర్తిగా కాపలేక పోతుంది . అందువల్ల సూర్యుడి మధ్యభాగం కప్పబడి, చుట్టూ అగ్నివలయంలా ఒక ప్రకాశవంతమైన రింగ్ కనిపిస్తుంది. ఇదే “ Ring of Fire ” అనే పేరు రావడానికి కారణం.

పూర్తి సూర్య గ్రహణంతో పోలిస్తే, ఈ Ring of Fire గ్రహణం లో సూర్యుడి వెలుగు పూర్తిగా మాయమవదు. ఆకాశం కొంత చీకటిగా మారినా, పూర్తిగా రాత్రిలా అనిపించదు. ఈ దృశ్యం చాలా అరుదుగా కనిపించే అద్భుతమైన ఖగోళ సంఘటన.

(ముఖ్య జాగ్రత్త: ఈ గ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడకూడదు.)

గ్రహణం అంటే అసలు ఏమిటి?

గ్రహణం అనేది పూర్తిగా Astronomical శాస్త్రానికి చెందిన సహజ సంఘటన. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరే ఖలో ఉన్నప్పుడు ఇది ఏర్పడుతుంది. అనేది అందరికీ తెలిసిన విషయమే.

రెండు రకాల గ్రహణాలు. (eclipse)

1) చంద్రుడు భూమి మరియు సూర్యుడి మధ్యకి వచ్చి సూర్యుడిని కప్పితే దాన్ని సూర్యగ్రహణం అంటారు.


2) భూమి సూర్యుడు మరియు చంద్రుడి మధ్యకి వచ్చి చంద్రుడిపై నీడ పడితే దాన్ని చంద్రగ్రహణం అంటారు.

ఇది ప్రకృతిలో జరిగే సాధారణ ప్రక్రియ. వేల సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది. శాస్త్రీయంగా చూస్తే ఇది ఒక ఆకాశ సంఘటన మాత్రమే.

గ్రహణం రోజు ఆహారం తినకూడదా/తినొచ్చా .?

మన భారతీయ సంస్కృతిలో గ్రహణం రోజు ఆహారం తినకూడదనే ఒక సంప్రదాయం ఉంది. ముఖ్యంగా:

  1. ముందుగానే వండిన అన్నం, మరియు కూరలు
  2. పాలు, పెరుగు
  3. కట్ చేసిన పండ్లు
  4. మాంసాహారం, ఇలాంటివి.

ఇవన్నీ తినరాదని పెద్దలు చూపుతారు. కొందరు గ్రహణం ప్రారంభానికి ముందే ఉపవాసం ఉండి, గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి తాజా ఆహారం వండుకుని తినడం అలవాటు..

శాస్త్రీయ కారణం ఏమిటి?

పాతకాలంలో Fridge సదుపాయం లేకపోవడంతో, ఆహారం ఎక్కువసేపు బయట ఉంచితే త్వరగా చెడిపోయే అవకాశం ఉండేది. గ్రహణం సమయంలో ఉష్ణోగ్రత మార్పులు, తేమ ప్రభావం వంటి అంశాల వల్ల ఆహారం చెడిపోతుందని భావించి ఈ నియమాలు ఏర్పడాయి.

కానీ నేటి కాలంలో Fridges, శుభ్రత సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి శుభ్రంగా, తాజాగా వండిన ఆహారం తినడంలో ఎలాంటి ప్రమాదం లేదు. గ్రహణం వల్ల ఆహారం విషపూరితం అవుతుందనే శాస్త్రీయ ఆధారం లేదు.

తులసి ఆకులు ఎందుకు వేస్తారు?

కొంతమంది గ్రహణం ముందు వండిన ఆహారంలో తులసి ఆకులు వేస్తారు. తులసి కి Antibacterial గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది. అందువల్ల ఆహారం చెడిపోకుండా ఉండేందుకు ఇది ఒక సంప్రదాయ పద్ధతిగా మారింది.

గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలా?

గ్రహణం సమయంలో గర్భిణీలు బయటికి రావద్దని, పదునైన(sharp) వస్తువులు వాడకూడదని, సూది దారం పట్టకూడదని వంటి అనేక నమ్మకాలు ఉన్నాయి. కొందరు గ్రహణ కిరణాలు గర్భంలోని శిశువుపై ప్రభావం చూపుతాయని అంటారు.

వైద్యపరంగా (since) ఐతే ఏమంటారు?

Since ప్రకారం గ్రహణం(eclipse)కిరణాలు ప్రత్యేకంగా హానికరమనే నిర్ధారణ లేదు. కానీ Solar eclipse నేరుగా కళ్లతో చూడడం ప్రమాదకరం – అది ఎవరికైనా హానికరమే. కాబట్టి గర్భిణీలు సహా అందరూ జాగ్రత్తగా ఉండాలి.

భయం, ఒత్తిడి, ఆందోళన గర్భిణీలకు హానికరం కావచ్చు. కాబట్టి గ్రహణం గురించి భయపడకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది.

ఏదైనా కానీ గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయం లో బయటికి రాకపోవడం మంచిది.

సూర్యగ్రహణం(solar eclipse)చూడవచ్చా?

సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా చూడడం వల్ల కలలో ఉన్న Retina  దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది “Solar retinopathy” అనే సమస్యకు దారితీయవచ్చు. కాబట్టి ప్రత్యేకంగా రూపొందించిన Certified Eclipse Glasses లేకుండా చూడకూడదు.

చంద్రగ్రహణం మాత్రం కళ్లకు హాని చేయదు. దాన్ని నేరుగా చూడవచ్చు.అని scientist లు చెప్తున్నారు.

గ్రహణం వల్ల తలనొప్పి, అస్వస్థత వస్తుందా.?

కొంతమంది గ్రహణం సమయంలో తలనొప్పి, బలహీనత, అసౌకర్యం అనుభవిస్తున్నామని చెబుతారు. దీనికి ప్రధాన కారణం మానసిక ప్రభావం కావచ్చు. భయం, ఆందోళన, ఉపవాసం, నిద్రలేమి వంటి కారణాలు శరీరంపై ప్రభావం చూపుతాయి.

శాస్త్రీయంగా గ్రహణం కారణంగా శరీరంలో అకస్మాత్తుగా Hormone మార్పులు వస్తాయని ఆధారం లేదు.

ఆధ్యాత్మిక ప్రాధాన్యం.

మన సంస్కృతిలో గ్రహణాన్ని ఒక ఆధ్యాత్మిక సమయంగా భావిస్తారు. కొందరు ఈ సమయంలో జపం, ధ్యానం చేస్తారు. ఆలయాలు మూసివేయడం, గ్రహణం తర్వాత శుద్ధి చేయడం వంటి ఆచారాలు కూడా ఉన్నాయి. ఇవి విశ్వాసానికి సంబంధించినవి.

గ్రహణం తర్వాత స్నానం అవసరమా ఎందుకు?

గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయడం ఒక సంప్రదాయం. ఇది శరీరాన్ని శుభ్రపరచడం, మానసికంగా కొత్త ప్రారంభం అనుభూతి కలిగించడం కోసం ఉండవచ్చు. వైద్యపరంగా ఇది తప్పనిసరి కాదు కానీ పరిశుభ్రత కోసం స్నానం చేయడం ఎప్పుడూ మంచిదే.

చిన్నపిల్లలపై(childrans)ప్రభావం ఉందా?

చిన్నపిల్లలు గ్రహణం గురించి వినిపించే భయపెట్టే మాటల వల్ల భయపడవచ్చు. అందువల్ల వారికి సరైన సమాచారం ఇవ్వడం ముఖ్యం. గ్రహణం ఒక సహజ సంఘటన మాత్రమే అని చెప్పాలి.

కాని చిన్నపిల్లలు growthing stage లో ఉంటారు కాబట్టి గ్రహణం సమయంలో బయటికి వదలకండి.

ఆచారం vs శాస్త్రం

గ్రహణం గురించి రెండు కోణాలు ఉన్నాయి – ఆచారం మరియు శాస్త్రం.
ఆచారాలను గౌరవించడం ఒక విషయం.                                         కానీ భయపడటం, అపోహలకు లోనవడం అవసరం లేదు. శాస్త్రీయంగా గ్రహణం మన ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుందనే నిర్ధారణ లేదు.

గ్రహణం రోజు పాటించాల్సిన జాగ్రత్తలు.

  1. సూర్యగ్రహణం అయితే నేరుగా చూడకండి.
  2. పరిశుభ్రంగా వండిన తాజా ఆహారం తినండి.
  3. గర్భిణీలు భయపడకుండా ప్రశాంతంగా ఉండాలి.
  4. సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మకండి.
  5. పిల్లలకు సరైన అవగాహన ఇవ్వండి.

Ring of Fire

గ్రహణం అనేది ప్రకృతిలో జరిగే అద్భుతమైన Astronomical సంఘటన. ఇది భయపడాల్సిన విషయం కాదు. అవగాహనతో, శాస్త్రీయ దృష్టితో చూస్తే ఇది ఒక అందమైన అనుభవం. మన సంప్రదాయాలను గౌరవిస్తూ, శాస్త్రాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం మంచిది. భయం కాదు – జ్ఞానం ముఖ్యం.

Leave a Comment