ఈ రోజుల్లో చిన్న వయస్సు నుంచి పెద్ద వయస్సు వరకు చాలామందిని బాధిస్తున్న సమస్యల్లో మోకాళ్ల నొప్పి ఒకటి. ముందు ఇది వృద్ధాప్యంలో మాత్రమే కనిపించే సమస్యగా భావించేవారు. కానీ ఇప్పుడు 25–30 ఏళ్ల వయసులోనే చాలామంది “మోకాళ్లు నొప్పిగా ఉన్నాయి”, “ఎక్కడం కష్టంగా ఉంది”, “కూర్చుని లేవడం ఇబ్బందిగా ఉంది” అని ఫిర్యాదు చేస్తున్నారు.
రోజురోజుకీ పెరుగుతున్న ఈ నొప్పి వెనుక అసలు కారణాలు ఏమిటి? ఇది సాధారణ సమస్యేనా? లేక శరీరం ఇస్తున్న పెద్ద హెచ్చరికా? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
మోకాళ్ల నొప్పిని చాలా మంది వయస్సు పెరిగిన తర్వాత వచ్చే సహజ సమస్యగా భావిస్తారు. కానీ నిజానికి ఇది జీవనశైలితో కూడా చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. ఎక్కువసేపు Mobile, laptop ముందు కూర్చోవడం, వ్యాయామం లేకపోవడం, సరిగ్గా Stretching చేయకపోవడం వంటి అలవాట్లు మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలహీన పరుస్తాయి. కండరాలు బలహీన పడితే మొత్తం ఒత్తిడి Joints మీద పడుతుంది. దీని వల్ల కార్టిలేజ్ నెమ్మదిగా దెబ్బతింటుంది. అదేవిధంగా, మహిళల్లో Hormone మార్పులు (ప్రత్యేకంగా 40 ఏళ్ల తర్వాత) ఎముకల సాంద్రత తగ్గడానికి కారణమవుతాయి. ఇది కూడా మోకాళ్ల నొప్పిని (knee pain)పెంచుతుంది. కొంతమందికి పాదాల ఆకారం (flat feet) లేదా తప్పుగా నడిచే అలవాటు కూడా మోకాళ్లపై అసమాన ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రారంభ దశలో చిన్న నొప్పిగా కనిపించినా, దాన్ని పట్టించుకోకపోతే వాపు, గట్టిపడటం, కదలిక తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి నొప్పి మొదలైన వెంటనే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, తగిన వ్యాయామాలు చేయడం, అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా పెద్ద సమస్యలను ముందుగానే నివారించవచ్చు.
A) మోకాలు ఎలా పనిచేస్తుంది .?
మోకాలు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన joints ఒకటి. ఇది తొడ ఎముక (Femur), కాలు ఎముక (Tibia), మరియు మోకాలి కప్ (Patella) కలిసి ఏర్పడుతుంది. Between these bones is a soft layer called cartilage.. ఇది ఘర్షణ తగ్గించి సాఫీగా కదలడానికి సహాయపడుతుంది.
ఈ Cartilage దెబ్బతింటే, Ligaments బలహీనపడితే లేదా Inflammation వచ్చినప్పుడు నొప్పి మెలగ మొదలవుతుంది.
B) రోజు రోజుకీ పెరుగుతున్న మోకాళ్ల నొప్పి ప్రధాన కారణాలు-
1) ఆస్టియోఆర్థరైటిస్ (Osteoarthritis)
ఇది వయసుతో వచ్చే సాధారణ సమస్య. కార్టిలేజ్ క్రమంగా దెబ్బతిని ఎముకలు ఒకదానికొకటి రాయడం వల్ల నొప్పి వస్తుంది.
లక్షణాలు:
- ఉదయం వెళ్లగానే మోకాలు గట్టిగా ఉండటం
- నడిచేటప్పుడు చప్పుడు రావడం
- మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువ నొప్పి అనిపించడం
2) బరువు ఎక్కువగా ఉండటం వల్ల .
అధిక బరువు వల్ల మోకాళ్లపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఒక్క KG అదనపు బరువు మోకాలకు 3–4 రెట్లు ఒత్తిడి కలిగిస్తుంది. దీని వల్ల జాయింట్లు త్వరగా అరిగిపోయి లేదా దెబ్బతింటాయి.
3) విటమిన్ D( Vitamin D)మరియు కాల్షియం లోపం.
శరీరంలో కాల్షియం, Vitamin D తక్కువగా ఉంటే ఎముకలు బలహీన పడతాయి. దీర్ఘకాలంలో ఇది మోకాళ్ల నొప్పికి దారితీస్తుంది.
4) Ligament (లిగమెంట్) గాయాలు.
క్రీడాకారులు(sports person)లేదా జిమ్(gym) చేసే వారు అకస్మాత్తుగా కాలు మడిచినప్పుడు లిగమెంట్ దెబ్బతినవచ్చు.దానివల వారిలో ACL, MCL గాయాలు ఎక్కువగా కనిపిస్తాయి.
5) రుమాటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis)
ఇది Autoimmune వ్యాధి. శరీరం స్వయంగా joints లా పై దాడి చేస్తుంది. ఇది రెండు మోకాళ్లలో ఒకేసారి నొప్పి కలిగిస్తుంది.
6) ఎక్కువసేపు కూర్చునే అలవాటు.
ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు Seating works. రోజంతా కూర్చోవడం వల్ల జాయింట్లు గట్టిపడతాయి. రక్తప్రసరణ తగ్గుతుంది. దీని వల్ల కూడా నొప్పి(pain)వస్తుంది.
C) ఎప్పుడు దీని Serious గా తీసుకోవాలి.?
- మోకాలు వచ్చిపోతే (swelling) వచ్చినపుడు
- వేడి అనిపిస్తే
- రాత్రిళ్లు ఎక్కువ నొప్పి ఉంటే
- నడవలేని స్థితి వస్తే
ఇవి ఉంటే వెంటనే Orthopedic డాక్టర్ను సంప్రదించాలి.
D) పరీక్షలు ఏవి ఏవీ చేస్తారు?
- X-ray
- MRI
- రక్త పరీక్షలు (RA ఫ్యాక్టర్ కోసం)
- విటమిన్ D స్థాయిలు
ఇవి చేసి అసలు కారణం తెలుసుకుంటారు.
E) చికిత్స ఎలా ఉంటుంది?
1) మందులు
పెయిన్ కిల్లర్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు
2) ఫిజియోథెరపీ
మోకాలి చుట్టూ ఉన్న కండరాలను బల పరిచే వ్యాయామాలు
3) Calcium & Vitamin D Supplements
4) ఇంజెక్షన్లు
Hyaluronic acid or steroid injections
5) సర్జరీ( Surgery)
అత్యవసర పరిస్థితుల్లో Knee Replacement
F) మోకాళ్ల నొపిని సహజంగా ఎలా తగ్గించుకోవచ్చు.?
- బరువు తగ్గడం
- రోజూ 20–30 నిమిషాలు నడక
- Squats, light exercise
- వేడి నీటితో Fomentation
- కిల నూనెతో మసాజ్
G) కిల నొప్పులు ఉన్న వారు ఆహారం లో ఏమి తీసుకోవాలి ?
- పాలు, పెరుగు
- ఆకుకూరలు(vegetables)
- బాదం, వాల్నట్స్
- చేపలు(fish)
రోజు ఉదయం సూర్యకాంతిలో 15 నిమిషాలు ఉండడం.
చివరి మాట.
మోకాళ్ల నొప్పి చిన్న విషయం కాదు. మొదట్లో చిన్నగా అనిపించినా, రోజురోజుకీ పెరిగి పెద్ద సమస్యగా మారుతుంది. మీ శరీరం ఇస్తున్న ఈ హెచ్చరికను నిర్లక్ష్యం చేయొద్దు.
సరైన ఆహారం, సరైన వ్యాయామం, సమయానికి వైద్య పరీక్షలు – ఇవే మీ మోకాళ్లను కాపాడే మూడు ప్రధాన ఆయుధాలు.
ఇలాంటి మారినీ ఆరోగ్య అవగాహన కోసం చదవండి👇
https://arogyamtelugu.in/
Disclaimer .
ఈ వ్యాసంలో ఇవ్వబడిన సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్యుల సలహా, నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు.
మీకు మోకాళ్ల నొప్పి లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే, స్వయంగా మందులు వాడకండి. తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడు లేదా ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించండి. ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి వేర్వేరుగా ఉంటుంది, కాబట్టి ఇక్కడ పేర్కొన్న సూచనలు అందరికీ ఒకే విధంగా పనిచేస్తాయని హామీ ఇవ్వబడదు.
ఏదైనా వ్యాయామం, ఆహార మార్పులు లేదా సప్లిమెంట్స్ ప్రారంభించే ముందు వైద్య సలహా తీసుకోవడం అవసరం. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే నిర్ణయాలకు రచయిత/ప్రచురణకర్త బాధ్యత వహించరు.