Telegram Join My Telegram   WhatsApp Join My WhatsApp

Newborn Baby Weight Gain Tips: ఆరోగ్యంగా బరువు పెరగాలంటే తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన నిజాలు..!

పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఎదగడంలో మొదటి సూచిక ఏమిటి అంటే — సరైన బరువు పెరుగుదల. చాలా తల్లిదండ్రులు “మా బిడ్డ బరువు సరిపోతుందా?”, “పాలు సరిపోతున్నాయా?”, “ఇంకేమైనా ఇవ్వాలా?” అనే సందేహాలతో ఆందోళన చెందుతుంటారు. కానీ ప్రతి బిడ్డ ఎదుగుదల వేరు వేరుగా ఉంటుంది. సరైన అవగాహన ఉంటే unnecessary tension తగ్గుతుంది.

పుట్టిన వెంటనే బరువు తగ్గడం సహజమే.,

చాలా మంది కొత్త తల్లిదండ్రులు ఒక విషయం తెలియక ఆందోళన పడతారు — పుట్టిన మొదటి 5–7 రోజుల్లో బిడ్డ కొంత బరువు తగ్గడం సహజం. ఇది సాధారణంగా 5%–10% వరకు ఉండొచ్చు.
కానీ 2 వారాల్లోపే తిరిగి పుట్టిన బరువును అందుకోవాలి. అందుకోలేకపోతే pediatrician ను సంప్రదించాలి.

1) పిల్లల సాధారణ Weight Gain అయ్యే Patterns.

  • మొదటి 3 నెలల్లో: రోజుకు సుమారు 20–30 గ్రాములు పెరగడం సాధారణం
  • 3–6 నెలల్లో: వారానికి 100–150 గ్రాములు
  • 6 నెలలకి: పుట్టిన బరువుకు దాదాపు రెట్టింపు
  • 1 సంవత్సరం: పుట్టిన బరువుకు దాదాపు మూడు రెట్లు

2) తల్లిపాలు – Weight Gain కి బంగారు ప్రమాణం.

Newborn baby weight gain లో ముఖ్యమైనది తల్లిపాలు (Breastfeeding).
తల్లిపాలు పూర్తిగా balanced nutrition ఇస్తాయి:

  • ✔ సరైన fat content
  • ✔ protein
  • ✔ immunity boosters
  • ✔ easy digestion.

మొదటి 6 నెలలు exclusive breastfeeding చాలా ముఖ్యము.
👉 ప్రతి 1-2–3 గంటలకు ఒకసారి పాలు ఇవ్వాలి.

  1. రోజుకు కనీసం 6–8 wet diapers
  2. బిడ్డ feeding తర్వాత ప్రశాంతంగా ఉండడం
  3. Regular weight gain

3) తల్లిపాలు సరిపోవడం లేదని అనిపిస్తే ఏమి చేయాలి.?

చాలా తల్లిలో “నా పాలు సరిపోవట్లేదేమో” అని ఆందోళన చెందుతుంటారు. కానీ నిజానికి చాలా సందర్భాల్లో పాలు సరిపోతూనే ఉంటాయి. బిడ్డ తరచుగా ఏడవడం అంటే ఎప్పుడూ ఆకలే అన్నమాట కాదు — అది diaper సమస్య, గాలి ఇబ్బంది (gas), లేదా comfort కోసం కూడా ఉండవచ్చు.

పాలు పెరగడానికి తల్లి సరైన ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్, ఆకుకూరలు, పప్పులు, గింజలు, నీరు ఎక్కువగా తీసుకోవడం మంచిది. తల్లి ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే stress వల్ల milk supply తగ్గే అవకాశం ఉంటుంది.

Frequent feeding కూడా milk production పెంచుతుంది. “Demand and supply” principle ప్రకారం బిడ్డ ఎక్కువగా పాలు తాగితే శరీరం ఎక్కువగా పాలు ఉత్పత్తి చేస్తుంది.

అయితే బిడ్డకు నిరంతరం బరువు పెరగకపోతే, చాలా అలసటగా కనిపిస్తే లేదా పాలు తాగడానికి ఆసక్తి చూపకపోతే వెంటనే pediatrician ను సంప్రదించాలి. సరైన సమయంలో సరైన సలహా తీసుకుంటే బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి సహాయపడుతుంది.

4) Formula Feeding ఎప్పుడు.?

తల్లి పాలు సరిపోకపోతే pediatrician సూచనతో formula milk ఇవ్వవచ్చు.(స్వయంగా నిర్ణయం తీసుకోవద్దు)
కానీ:

❌ స్వయంగా బ్రాండ్ మార్చకండి
❌ చిన్నపాటి మిశ్రమం చేయకండి
❌ అవసరానికి మించి ఇవ్వకండి

Doctor సూచించిన పరిమాణమే ఇవ్వాలి.

5) పాలిచ్చే సరైన పద్ధతులు Feeding Technique

బిడ్డ సరైన విధంగా latch కాకపోతే పాలు పూర్తిగా అందవు.

✔ Baby mouth wide open ఉండాలి
✔ Areola ఎక్కువ భాగం mouth లో ఉండాలి
✔ Pain లేకుండా feeding జరగాలి

Latch సరిగ్గా ఉంటే weight gain కూడా మెరుగుపడుతుంది.

6) బిడ్డ నిద్ర కూడా ముఖ్యం.

Weight gain కి నిద్ర (sleep) కూడా అవసరం.
Newborns baby కి  రోజుకు 14–17 గంటలు నిద్రపోతారు.
Sleep సమయంలో growth hormones విడుదలవుతాయి.


👉 బిడ్డను feeding schedule కోసం పూర్తిగా sleep disturb చేయకూడదు (Doctor advice ప్రకారం మాత్రమే).

7) Massage & Bonding

సరైన baby oil massage వల్ల blood circulation మెరుగవుతుంది.
ఇది appetite మరియు digestion కి సహాయపడుతుంది.
అలాగే తల్లిదండ్రుల ప్రేమ, skin-to-skin contact వల్ల కూడా feeding response మెరుగుపడుతుంది.

8) Low Weight కి కారణాలు.

కొన్ని సందర్భాల్లో weight gain slow అవ్వడానికి కారణాలు:

  • Premature birth
  • Low birth weight
  • Tongue tie
  • Infection
  • Lactation issues

ఇవి ఉంటే self remedies కాకుండా doctor ని సంప్రదించాలి.

9) 6 నెలల తర్వాత Complementary Feeding ఇవ్వాలి.

  1. Rice cereal
  2. Mashed banana
  3. Dal water
  4. Vegetable puree

ఒక్కో కొత్త ఆహారం 3 రోజుల gap తో introduce చేయాలి.
Sugar, salt avoid చేయండి.

Dangerous Myths

❌ Honey ఇవ్వడం (1 సంవత్సరం ముందు ప్రమాదం)
❌ Cow milk ఇవ్వడం (1 సంవత్సరం ముందు వద్దు)
❌ Overfeeding చేయడం
❌ Weight కోసం unnecessary supplements వాడడం.

వీటిని avoid చేయాలి

Weight Monitoring ఎలా చేయాలి.?

  • ప్రతి నెల pediatric డాక్టర్ నీ కలవాలి
  • Growth chart check
  • Sudden drop ఉంటే వెంటనే consult చేయాలి

Home scale మీద ప్రతిరోజూ weigh చేయడం అవసరం లేదు. Weekly / monthly check చేస్తే సరిపోతుంది.

తల్లి తండ్రి తెలుసుకోవాల్సిన ముఖ్య సూచనలు.

  • ఇతర పిల్లలతో పోల్చకండి
  • Healthy baby అంటే chubby baby అనుకోవద్దు
  • Baby active గా ఉంటే చాలా మంచి సూచన
  • Panic కాకుండా professional advice తీసుకోండి

చివరిగా ఇదీ గుర్తుపెట్టుకోండి .

Newborn baby weight gain అనేది కేవలం సంఖ్య కాదు — అది మొత్తం ఆరోగ్యానికి ప్రతిబింబం. సరైన పాలు, ప్రేమ, శ్రద్ధ, మరియు medical guidance ఉంటే బిడ్డ సహజంగానే ఆరోగ్యంగా ఎదుగుతుంది. తల్లిదండ్రుల సహనం, విశ్వాసం, మరియు అవగాహన చాలా ముఖ్యం. చిన్న సందేహం ఉన్నా pediatrician ను సంప్రదించడం ఉత్తమ మార్గం.

Disclaimer.

ఈ వ్యాసం సాధారణ అవగాహన కోసం మాత్రమే అందించబడింది. Newborn baby weight gain కు సంబంధించిన సమాచారం సాధారణ మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి బిడ్డ ఆరోగ్య పరిస్థితి వేర్వేరుగా ఉండవచ్చు. బిడ్డ బరువు పెరగకపోవడం, పాలు తాగకపోవడం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు గమనించినట్లయితే తప్పనిసరిగా అనుభవజ్ఞులైన బాల వైద్యుడిని (Pediatrician) సంప్రదించండి. ఇక్కడ ఇచ్చిన సమాచారాన్ని వైద్య సలహాగా పరిగణించకండి.

Leave a Comment