Gym కాదు… Supplements కాదు… అయినా Weight Gain అవుతుందా? అసలు సీక్రెట్ ఇదే!
చాలామందికి ఇదే ఒక పెద్ద ఆలోచనగా మారింది — బరువు పెరగాలంటే తప్పనిసరిగా Gym కి వెళ్లాలి, Protein powders లేదా Supplements వాడాలి అని. కానీ నిజం ఏమిటంటే, మన శరీరం సహజంగా సరైన ఆహారం, సరైన నిద్ర, సరైన జీవనశైలి ద్వారా కూడా ఆరోగ్యంగా బరువు పెరుగుతుంది. Magic trick ఏమీ లేదు… కానీ సరైన పద్ధతి లో అనుసరిస్తే చాలు. అదే ఈ “అసలైన సీక్రెట్”.
1) అసలైన Secret – Calories Surplus
Weight gain లో మొదటి నియమం చాలా simple.
మీరు రోజుకు burn చేసే calories కంటే కొంచెం ఎక్కువ calories తినాలి. దీన్నే calorie surplus అంటారు.
ఉదాహరణకు, మీ body రోజుకు 2000 calories ఖర్చు చేస్తే, మీరు 2300–2500 calories తీసుకుంటే క్రమంగా బరువు పెరుగుతుంది. ఇది ఒక్కరోజులో జరగదు. కానీ 3–4 వారాల్లో మార్పు కనిపిస్తుంది.
కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే — Junk food తిని పెరిగే బరువు ఆరోగ్యకరం కాదు. అది కేవలం పొట్ట వద్ద కొవ్వుగా (belly fat)పేరుకు పోతుంది. మనకు కావాల్సింది healthy weight gain.
2) Natural High-Calorie Foods – Supplements అవసరం లేదు.
Supplement powders లేకుండానే మన ఇళ్లలో ఉండే ఆహారాలతో బరువు పెరగవచ్చు.
- అన్నం(rice)
- పప్పులు
- గుడ్లు(eggs)
- పాలు, పెరుగు(milk, curd)
- బంగాళాదుంప(potato)
- పీనట్స్, డ్రై ఫ్రూట్స్(dry fruits)
- అరటిపండ్లు(babbana)
ఉదయం ఒక గ్లాస్ పాలు + 1 banana + కొద్దిగా Peanut butter + 2 Dates(ఖర్జూరాలు)కలిపి shake చేసి తాగితే 400–600 calories వస్తాయి. ఇది పూర్తిగా సహజమైన energy drink.
3) రోజుకు 5–6 సార్లు తినడం.(more then 3 times)
“నాకు ఆకలి రాదు” అని చాలామంది అంటారు. అలాంటప్పుడు ఒకేసారి ఎక్కువ తినడానికి ప్రయత్నించకండి.
దానికి బదులుగా రోజుకు 5–6 సార్లు చిన్న చిన్న meals తీసుకోండి.
ఉదాహరణకు:
- Breakfast
- Mid-morning snack
- Lunch
- Evening snack
- Dinner
- Bedtime milk
ఇలా తింటే body కి ఎప్పుడూ nutrition supply అవుతుంది. Weight gain process smooth గా జరుగుతుంది.
4) Protein – Muscle కోసం అవసరం.
Gym కి వెళ్లకపోయినా కూడా muscle mass పెరగాలి అంటే protein అవసరం.
గుడ్లు, పప్పులు, పెసర్లు, చికెన్, పెరుగు — ఇవి మంచి protein sources.
రోజుకు కనీసం 1 kg body weight కి 1–1.2 grams protein తీసుకుంటే muscle growth కి సహాయం అవుతుంది.
5) Light Exercise – Gym అవసరం లేదు.
Gym కి వెళ్లకపోయినా, పూర్తిగా inactive గా ఉండకూడదు.
చిన్న చిన్న exercises చేస్తే muscle mass పెరుగుతుంది.
- Push-ups
- Squats
- Stair climbing
- 20–30 నిమిషాల brisk walking
ఇవి muscles ని stimulate చేస్తాయి. అప్పుడు తిన్న ఆహారం fat కాకుండా muscle గా మారుతుంది.
6) నిద్ర – Growth Hormone సమయం.
7–8 గంటల మంచి నిద్ర చాలా ముఖ్యమైనది.
Sleep సమయంలో body growth hormone విడుదల అవుతుంది. ఇది muscle repair & growth కి అవసరం.
Late night mobile usage తగ్గించండి.
నిద్రపోయే ముందు heavy screen time avoid చేయండి.
7) Stress తగ్గించండి.
అధిక stress ఉన్నప్పుడు body weight పెరగడం కష్టం. Cortisol hormone ఎక్కువైతే appetite తగ్గిపోతుంది.
Yoga, deep breathing, meditation లాంటి పద్ధతులు ఉపయోగపడతాయి.
8) 30 Days Simple Plan.(note it)
- ఉదయం: 4 idly / dosa + 2 eggs + milk
- మధ్యాహ్నం: rice + dal + vegetable + curd
- సాయంత్రం: banana + peanuts
- రాత్రి: rice/roti + egg/chicken
- నిద్రకు ముందు: warm milk
ఈ plan ని క్రమంగా follow చేస్తే 1 నెలలో 2–3 kg వరకు పెరగవచ్చు (body type మీద ఆధారపడి ఉంటుంది).
జాగ్రత్తలు.
ఎక్కువగా oil, junk food తినకండి
ఒక్కసారిగా 5–6 kg పెరగాలని ప్రయత్నించకండి
చాలా తక్కువ weight ఉన్నవారు లేదా medical condition ఉన్నవారు doctor ని సంప్రదించాలి.
Gym కాదు… Supplements కాదు… అయినా Weight Gain అవుతుంది.
కానీ consistency ఉండాలి. సరైన ఆహారం, సరైన sleep, కొద్దిగా exercise — ఇవే అసలు Secret.
weight loss అవడానికి ఇది చదవండి 👇
WEIGHT LOSS అవడానికి అన్నం మానేయాల్సిన అవసరం లేదు.! Doctor చెప్పిన నిజాలు ఇవే.
ఆరోగ్యం తెలుగు.
ఆరోగ్యం మహాభాగ్యం .