
డయాబెటిస్ (SUGAR) ఉన్న వాళ్లలో చాలామందికి ఉండే common doubt – మద్యం పూర్తిగా మానేయాలా.? లేక కొంచెమైనా తాగొచ్చా?
స్నేహితుల మధ్య, ఫ్యాక్షన్ లో, పండగ లప్పుడు మద్యం అలవాటు ఉన్నవాళ్లకు ఇది పెద్ద ప్రశ్నగా ఉంటుంది .?
కానీ గుర్తుంచుకోవాల్సిన నిజం ఏంటంటే – డయాబెటిస్ (sugar) ఉనవాలకి మద్యం పూర్తిగా safe కాదు. అయినా కొన్ని పరిస్థితుల్లో, కొన్ని రకాల మద్యం చాలా తక్కువ మొత్తం లో తీసుకుంటే ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.
ఇపుడు Beer, Whisky, Wine – ఈ మూడింటిలో ఏది ఎక్కువ ప్రమాద కరమైనది ? ఏది తక్కువ నష్టం కలిగిస్తుంది ? అని తెలుసుకుందాం.
డయాబెటిస్ ఉన్నవాళ్లు మద్యం తాగితే శరీరంలో ఏం జరుగుతుంది?
మద్యం తాగినప్పుడు లివర్ (liver) పని మారిపోతుంది.
సాధారణంగా లివర్ మన శరీరానికి అవసరమైనప్పుడు glucose ను విడుదల చేస్తుంది. కానీ మద్యం తీసుకున్నప్పుడు లివర్ మద్యని ఎక్కువగా జీర్ణించడానికి ఏకువ పని చేయాల్సి ఉంటుంది. దాంతో రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పడి పోవచ్చు (Hypoglycemia) లేదా కొన్నిసార్లు అకస్మాత్తుగా Sugar level పెరిగిపోవచ్చు.
:- అంటే, మద్యం వల్ల
1) Sugar control తప్పి పోతుంది
2) మందుల ప్రభావం మారిపోతుంది
3) రాత్రి నిద్రలోనే sugar ప్రమాదకరంగా మారిపోవచ్చు
అందుకే డయాబెటిస్(sugar) ఉన్నవాళ్లు ALCOHAL విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
Beer – డయాబెటిస్ ఉన్నవాళ్లకు ఎందుకు ప్రమాదం?
Beer అనేది చాలా మందికి లైట్ డ్రింక్ లా అనిపిస్తుంది. కానీ డయాబెటిస్ ఉన్నవాళ్లకు ఇది అంతగా మంచిది కాదు.
Beer లో సమస్యలు:-
* Carbohydrates ఎక్కువ గా ఉంటాయి
* Sugar levels ని వేగంగా పెంచుతుంది
* తాగిన తర్వాత ఆకలి పెరిగి ఎక్కువ తినే
అవకాశం కల్పిస్తుంది
* రోజూ తాగితే బరువు కూడా పెంచుతుంది
:- డాక్టర్ల అభిప్రాయం ప్రకారం:
డయాబెటిస్ ఉన్నవాళ్లు Beer తాగడం మానేయడం చాలా మంచిది. ప్రత్యేక సందర్భాల్లో కూడా Beer ని ఎంచుకోక పోవడమే సేఫ్.!
Whisky – తాగొచ్చా?
Whisky లో సాధారణంగా చక్కెర(sugar )ఉండదు, Carbohydrates కూడా తక్కువగా ఉంటాయి. అందుకే కొంతమంది “Whisky అయితే సేఫ్” అనుకుంటారు.
ఇది పూర్తిగా నిజం కాదు..
:-Whisky ప్రయోజనాలు:
1) Sugar direct గా పెంచదు
2) Carb content తకువుగా ఉంటుంది .✔️
:-కానీ దీనివల కలిగే ప్రమాదాలు:
* ఖాళీ కడుపుతో తాగితే sugar ఒక్కసారిగా
పడిపోతుంది
* మందులు తీసుకునే వాళ్లయితే
Hypoglycemia రిస్క్ ఉంటుంది.
* ఎక్కువ మోతాదు లో తీసుకుంటే లివర్, కిడ్నీలకు హాని
చేపడుతుంది.
👉 సేఫ్ levels (తప్పనిసరిగా పాటించాలి):
* ఒకసారికి గరిష్టంగా 30 ml (ఒక చిన్న peg)
* వారానికి 1 లేదా 2 సార్లు మించకుండ తీసుకోవచ్చు
* తప్పకుండా ఆహారం తిన్న తర్వాతే తాగాలి.
Wine – డయాబెటిస్ ఉన్నవాళ్లకు కొంచెం మంచి ఆప్షన్.
Beer, Whisky, Wine – ఈ మూడింటిలో Wine (ప్రత్యేకంగా Dry Red Wine) కొంచెం బెటర్ అని డాక్టర్లు చెబుతారు.
ఎందుకు Wine బెటర్ అంటే ?
* Sugar తక్కువగా ఉంటుంది
* Red Wine లో antioxidants ఉంటాయి మరియు
* కొంత వరకు insulin sensitivity
మెరుగుపడుతుంది.
కానీ గుర్తుంచుకోవాలి:
* Sweet Wine అసలు తీసుకోవద్దు
* Dry Red Wine మాత్రమే రిఫర్ చేయండి
* మితిమీరితే Wine కూడా ప్రమాదమే అని గుర్తించండి
👉 సేఫ్ Levels(తప్పనిసరిగా పాటించాలి)
* రోజుకు ఒకసారి 100–120 ml మాత్రమే
* ప్రతిరోజూ కాదు
* వారానికి 1–2 సార్లు మాత్రమే.,
మద్యం తాగేటప్పుడు తప్పక పాటించాల్సిన నియమాలు.
డయాబెటిస్ ఉన్నవాళ్లు ఈ నియమాలు పాటించకపోతే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ☠️
* ఖాళీ కడుపుతో ఎప్పుడూ మద్యం తీసుకోవోడు
* మద్యం తాగిన రోజు Sweets, junk food
మానేయాలి
* Insulin లేదా Sugar మందులు వాడే వాళ్ళయితే
ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి
* తాగిన రోజు రాత్రి Sugar చెక్ చేయడం
మర్చిపోకండి
* రోజూ అలవాటైతే → మద్యం తప్పక మానేయాలి
లేదంటే ప్రమాదం
ఇలాంటివారు అసలు మద్యం తాగకూడదు?
ఈ కింది వాళ్లు మద్యం పూర్తిగా మానేయాలి ❌
* Sugar levels ఎక్కువగా ఉండేవాళ్ళు
* Insulin తీసుకునే వాళ్లు
* Kidney లేదా Liver సమస్యలు ఉన్నవాళ్లు
* గుండె(Heart)సమస్యలు ఉన్నవాళ్లు
* తరచూ Hypoglycemia వస్తున్న వాళ్లు
డాక్టర్లు చెప్తున్న మాట.
డయాబెటిస్ ఉన్నవాళ్లకు Alcohal అవసరం లేదు.
పూర్తిగా మానుకుంటే అదే ఉత్తమం.
మానలేని పరిస్థితిలో ఉంటే.
:- Beer తీసుకోవద్దు
:- Whisky చాలా తక్కువ మోతాదులో, తీసుకోవచ్చు
:- Dry Red Wine మరింత బెటర్.
తుది నిర్ణయం మీ సొంతం :–
Diabetes + alcohol = A dangerous combination.
మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కొంచెం నియంత్రణ పాటిస్తే భవిష్యత్తులో పెద్ద సమస్యల నుంచి తప్పించుకోవచ్చు….
ఆరోగ్యం తెలుగు…