Telegram Join My Telegram   WhatsApp Join My WhatsApp

కిడ్నీ లో STONES మరియు నొప్పి నా ? ఆపరేషన్ అవసరం లేకుండా కిడ్ని లో రాళ్లు కరిగించే మార్గం ఇదే!

కిడ్నీలో Stones (రాళ్లు) ఉన్నాయా? నొప్పి భరించడం అవట్లేద ? చాలా మందికి వెంటనే “ఆపరేషన్ తప్పదేమో” అనే భయం వస్తుంది. కానీ ప్రతి కిడ్నీ రాయికి ఆపరేషన్ అవసరం లేదు. సరైన సమయంలో, సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆపరేషన్ లేకుండానే కిడ్నీ రాళ్లు easy కరిగే అవకాశముంది. ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోండి.

కిడ్నీ Stones అంటే ఏమిటి ?

మన శరీరంలో మూత్రం ద్వారా బయటకు వెళ్లాల్సిన కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ లాంటి పదార్థాలు కిడ్నీలో పేరుకుపోతే చిన్న చిన్న Crystals గా మారుతాయి. ఇవే క్రమంగా పెద్దవిగా మారి Kidney Stones (రాళ్లు) అవుతాయి.

కిడ్నీ లో రాళ్లు వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు.!

*వెన్ను పక్క భాగంలో లేదా నడుము దగ్గర తీవ్ర నొప్పి
* మూత్రంలో మంట, రక్తం
* తరచూ మూత్రం రావడం
* వాంతులు, నాసియా
* జ్వరం (When there is an infection)
     :- కొంతమందిలో ಈ లక్షణాలు లేకుండానే కూడా రాళ్లు ఉండవచ్చు.

ప్రతి కిడ్నీ రాయికి ఆపరేషన్ అవసరమా ? కదా ?
   ಅವಸರಂ లేదు
4 mm – 6 mm లోపు ఉన్న రాళ్లు మరియు
కొత్తగా ఏర్పడిన చిన్న రాళ్లు
ఇవి చాలాసార్లు సహజంగానే మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. దీనికన్నా పెద్ద రాళ్లు లేదా తీవ్రమైన సమస్యలు ఉన్నపుడు మాత్రమే ఆపరేషన్ అవసరం అవుతుంది.

ఆపరేషన్ లేకుండా నే కిడ్నీ లో రాళ్లు కరిగే మార్గాలు.

1. నీరు –
అత్యంత ముఖ్యమైన మందు
రోజుకు కనీసం 5–6 లీటర్ల నీరు తాగాలి.
మూత్రం Light Color లో రావాలి అందుకనే నీలు ఎక్కువగా తాగాలి
నీరు ఎక్కువ తాగితే చిన్న చిన్న రాళ్లు బయటకు వెళ్లే అవకాశం పెరుగుతుంది
👉 నీరు తాగక పోవడం కిడ్నీ Stones కు ప్రధాన కారణం.

2. నిమ్మకాయ నీరు –
నిమ్మకాయలో ఉండే Citric acid రాళ్లు పెరగకుండా అడ్డుకుంటుంది.
రోజుకు 1–2 నిమ్మకాయల రసం నీటిలో కలిపి తాగండి.
సూచన:- షుగర్ లేదా ఉప్పు కలప కండి.

3. కొబ్బరి నీరు-
సహజమైన Detox drink ఇది
మూత్ర ప్రవాహాన్ని పెంచుతుంది
రోజుకు 1 గ్లాస్ సరిపోతుంది

4. ఆహారంలో మార్పులు (ఇది చాలా ముఖ్యం)
:-  తగ్గించాల్సినది:
* ఎక్కువ ఉప్పు తినకండి
* ప్యాకెట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ నీ avoid చేయండి
* ఎక్కువ టీ, కాఫీ తాగకండి

:- తినాల్సినవి:
* కూరగాయలు (vegetables)
* పండ్లు(fruits)
* జొన్న, రాగి లాంటి ధాన్యాలు
* మజ్జిగ

5. మెడికల్ మార్గ దర్శనంతో మందులు
డాక్టర్ సూచించినట్లుగా:
* Stone size తగ్గించే మందులు
* నొప్పి తగ్గించే మందులు
* మూత్రనాళం రిలాక్స్ అయ్యే టాబ్లెట్లు
సూచన :- డాక్టర్ సలహా లేకుండా మందులు వాడకండి.

6. శారీరక చలనం
* రోజూ కొంత సమయం walking
* లైట్ గా వ్యాయామాలు (yoga)
ఇవి రాళ్లు కదలడానికి సహాయపడతాయి.

ఎప్పుడు తప్పకుండా డాక్టర్‌ను కలవాలి?
* నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు
* మూత్రంలో రక్తం ఎక్కువగా వస్తే
* జ్వరం వస్తే
* రాయి Size 8 mm కంటే ఎక్కువగా ఉంటే వాళ్ళు
* ఒకే కిడ్నీ పనిచేస్తున్నవారికి
     ఇవి ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా Urologist ను కలవాలి.

ముఖ్యమైన నిజం.
ఇంట్లో చెప్పే కొన్ని చిట్కాలు (ఆకులు, పొడులు) అందరికీ సరిపోవు. కొందరిలో రాళ్లు కరిగినా, మరికొందరిలో సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి Scan report చూసిన తర్వాతే చికిత్స చేయాలి.

         ఆరోగ్యం తెలుగు .

Leave a Comment