Telegram Join My Telegram   WhatsApp Join My WhatsApp

రాత్రి సరిగా నిద్ర పట్టట్లేదా.? కారణం ఫోన్ కాదు ఇది.
90 శాతం మందికి ఇది తెలియదు..!

మధ్య కాలంలో  ఈ ఒక సమస్య చాలా సాధారణం అయిపోయింది – రాత్రి నిద్ర పట్టడం లేదు.
మంచంపై పడుకున్నా కూడా నిద్ర రాదు , గడియారం లో చూస్తూ గంటలు గడుసు పోతున్నాయి. చివరికి తెల్లవారుజాము నా నిద్ర పడుతుంది. ఉదయం లేవగానే అలసట, చిరాకు, పనిపై ఆసక్తి రాకపోవడం.
ఇలాంటి పరిస్థితిలో చాలామంది అనుకునేది ఒక్కటే.,

“రాత్రి ఫోన్ ఎక్కువగా చూస్తున్నాను కాబట్టే నిద్ర రావట్లేదు.” కానీ నిజం ఏమిటంటే…?


➡️ ఫోన్ అసలు కారణమే కాదు.
* మన శరీరంలో జరుగుతున్న కొన్ని మార్పులే నిద్ర రాకపోవడానికి అసలు కారణం. .

నిద్రకు అసలైన కీలకం ఏంటంటే..?
మన శరీరం సహజంగా నిద్రకు సిద్ధమయ్యేలా చేసే Hormone ఒకటి ఉంటుంది .
దాని పేరు Melatonin (మెలటోనిన్).

Hormone పని ఏమిటంటే ..?
రాత్రి చీకటి పడగానే తన పని మొదలవుతుంది
శరీరం లోని మెదడు భాగానికి “ఇప్పుడు నిద్ర పోయే టైమ్” అని సంకేతం ఇచ్చేది.!
శరీరాన్ని రిలాక్స్ MODE లోకి తీసుకు వెళ్తుంది
కానీ ఇప్పుడు చాలా మందిలో ఈ Melatonin అనేది సరైన సమయంలో విడుదల కావడం లేదు.
దీనివలనే ఎంత అలసటగ ఉన్నా నిద్ర రావడం లేదు.

➡️Melatonin ఎందుకు తగ్గిపోతుంది?

*ఇదే 90 శాతం మందికి తెలియని అసలు విషయం .!

కింద చూడండి .👇
1) రాత్రి  వేళ గదిలో ఎక్కువగా వెలుతురు ఉండడం..,
2) high focus LED లైట్లు
3) TV ఆన్ లోన్ ఉంచి నిద్రపోవడం
4) పూర్తిగా చీకటి లేకపోవడం కూడా ఒక కారణమే.
ఇవి మెదడుకు “ఇప్పటికీ పగలే ఉంది” అనే సంకేతం ఇస్తాయి.
అప్పుడే Melatonin తయారీ తగ్గిపోతూ వస్తుంది.
👉 ఫోన్ కన్నా గదిలో Light వలనే ఎక్కువ నష్టం చేస్తుంది.

➡️ Stress & ఎక్కువ ఆలోచనలు.

రాత్రి మంచం పైన పడుకున్నాక మొదలయ్యే ఆలోచనలు..;
1) ఉద్యోగ టెన్షన్(tension)
2) డబ్బుల సమస్యలు
3) ఫ్యామిలీ(family) బాధ్యతలు
4) భవిష్యత్తు గురించి భయం
ఇవి మెదడును నిద్ర పోనీయకుండా ఆపుతుంది.
దీనివలన శరీరం ఇప్పటికి “Alert Mode” లోనే ఉంటుంది.
👉 ఇది ఫోన్ వల్ల కాదు
👉 మానసిక ఒత్తిడి వల్ల.

➡️ రాత్రి ఆలస్యంగా పడుకోవడం, బరువైన భోజనం చేయడం
చాలామంది చేసే తప్పులు .!

రాత్రి 10 నుంచి11:00 గంటలకు భోజనం చేయడం
మసాలా, ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం
*Fried foods
*Biryani , EX….
ఇలా తింటే జీర్ణక్రియకు ఎక్కువసేపు సమయం పడుతుంది. దీనివలన
శరీరం ఇంకా “Active” గా ఉంటుంది.
అందుకే నిద్ర రావడానికి అవసరమైన Relax దశ రాదు.

➡️ ఉదయం సూర్యకాంతి లేకపోవడం
ఇది చాలా మందికి అస్సలు తెలియదు.

ఉదయం సూర్యకాంతి మన శరీరానికి ఒక టైమింగ్ నీ నేర్పుతుంది.
దాని వల్లన రాత్రి సరైన సమయంలో నిద్ర వస్తుంటుంది.
కానీ ఇప్పుడు:
*ఎక్కువసేపు ఇంట్లోనే ఉండడం వల్ల మరియు
*”Screen”  ముందు ఎక్కువ సేపు కూచోవడంవల
*బయటకి వెళ్లకపోవడం వలన
దీనివల Body clock పూర్తిగా గందరగోళం అవుతుంది.

➡️అయితే ఫోన్ పూర్తిగా తప్పుకాదా?

ఫోన్ వల్ల కొంత ప్రభావం ఉంటుంది –
కళ్ళకు పడే Blue Light వల్ల
మెదడు కొంత Active అవుతుంది.

కానీ మీరు:
Stress తగ్గించుకోవడం వల్ల
సరైన లైటింగ్‌లో నిద్రపోతే
క్రమమైన జీవనశైలి పాటిస్తే
👉 ఫోన్ ఉన్నా కూడా నిద్ర రావచ్చు.

➡️ సహజంగా నిద్ర రావాలంటే ఏమి చేయాలి?

* నిద్రపోయే గదిని వీలైనంత చీకటిగా ఉంచండి
* Dim లైట్ ఉపయోగించండి
* TV ఆఫ్ చేయండి
* పూర్తిగా చీకటి అయితే ఇంకా మంచిది.


✔️ పడుకునే ముందు మనసును శాంతి పడిచే పని చేయడి
* 5 నిమిషాలు “breath in breathe out” చేయడం మంచిది
* మీ ఆలోచనలను ఒక Paper పై రాయడం

✅ రాత్రి భోజనం నిద్రకి 2 నుంచి 3 గంటల ముందే చేయండి
సరిపోయేంత ఆహారం తీసుకోండి

✅ ఉదయం సూర్యకాంతి వెలుగులో తప్పనిసరి
రోజూ 10 నుంచి15 నిమిషాలు బయట Walk చేయండి.
ఇది రాత్రి నిద్రను Automatic గా మెరుగుపరుస్తుంది

✅ ఒకే Time కి నిద్రనీ అలవాటు చేసుకోండి.
Weekend అయినా Time మార్చవద్దు
ఇది బాడీ Clock ని సెట్ చేస్తుంది


➡️నిద్ర రాకపోవడం నీ లైట్‌గా తీసుకోకండి.

నిద్ర సరిగా లేకపోతే:
– షుగర్ పెరిగే అవకాశం
– బీపీ సమస్యలు
– జ్ఞాపకశక్తి తగ్గడం
– గుండె సంబంధిత ప్రమాదాలు
వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది
అందుకే నిద్రని lazy చేయకండి…

చివరి మాట:-
👉 రాత్రి నిద్ర రావట్లేదని Phone ని మాత్రమే నిందించకండి
👉 అసలు కారణం – stress, lighting, lifestyle, body clock.
వీటిని సరి చేసుకుంటే..


— మందులు లేకుండానే నిద్ర పడుతుంది.

–లోతైన నిద్ర మీ సొంతం అవుతుంది. !

* ఆరోగ్యమే మహాభాగ్యం
-ఆరోగ్యం తెలుగు*

Leave a Comment