
రోజూ కడుపు ఉబ్బరంగా ఉందా? ఛాతీలో మంట వస్తుందా? తిన్న వెంటనే అసహనం తో మొదలవుతుందా?
“గ్యాస్ట్రిక్ ” అంతే అని మనం లైట్‌గా తీసుకుని ఒక మాత్ర (tablet) వేసుకుంటాం…
కానీ నిజంగా ఇది అంత చిన్న విషయం కాదు. గ్యాస్ట్రిక్ అనేది ఒక్కరోజులో వచ్చిపోయే సమస్య కాదు – ఇది మన శరీరం మెల్లగా ఇస్తున్న హెచ్చరిక. మీరు పట్టించుకోకపోతే నిశ్శబ్దంగా లోపల పెరుగుతుంది. ఈరోజు కేవలం గ్యాస్‌గా అనిపించేది, రేపు పెద్ద జీర్ణ సమస్యగా మారే ప్రమాదం ఉంది. అందుకే గ్యాస్ట్రిక్‌ని నిర్లక్ష్యం చేయడం కాదు, అర్థం చేసుకోవడం మొదలు పెట్టాలి.
Gastric అంటే ఏమిటి?
మన కడుపులో ఆహారం జీర్ణం కావడానికి ఆమ్లాలు (Acids) తప్పనిసరిగా ఉత్పత్తి అవుతాయి.
ఈ ఆమ్లాల అసంతుల్యత సమతుల్యత తప్పినప్పుడు .
- గ్యాస్
- మంట 🔥
- కడుపు ఉబ్బరం
- వాంతి భావన(vomit feeling) 🤢లాంటివి వస్తాయి .
వీటినే మనం “Gastric” అని అంటాం.
ఎందుకు గ్యాస్ట్రిక్ (gastric)సమస్య ఎక్కువ అవుతోంది?
ఈ రోజుల్లో గ్యాస్ట్రిక్ సాధారణ సమస్యగా మారడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి:
1) టైమ్ పాటించకుండా తినడం.
సమయానికి తినకపోవడం, చాలా గ్యాప్ ఒదిలి పెట్టి తినడం వల్ల
కడుపులో ఆమ్లాలు ఎక్కువగా తయారవుతాయి.
2) బయట ఆహారం & జంక్ ఫుడ్. (outside foods)
మసాలా, ఆయిల్, బేకరీ, ఫాస్ట్ ఫుడ్
జీర్ణవ్యవస్థను బలహీన పరుస్తాయి.
3) Stress మరియు & నిద్ర లోపం వల్ల
మానసిక ఒత్తిడి కూడా కడుపుపై నేరుగా ప్రభావం చూపుతుంది.
నిద్ర తక్కువైతే గ్యాస్ట్రిక్ పెరుగుతుంది.
4) ఖాళీ కడుపుతో కాఫీ / టీ.
ఇది చాలా మందికి అలవాటు.
కానీ ఇది ఆమ్ల ఉత్పత్తిని రెట్టింపు చేస్తుంది.
గ్యాస్ట్రిక్ (gastric)లక్షణాలు ఎలా ఉంటాయి?
రోజూ లేదా తరచూ ఇవి లక్షణాలు ఉంటే జాగ్రత్త .
- ఛాతీలో మంట
- గొంతులో పుల్లగా పుల్లగా రావడం
- కడుపు ఉబ్బరం అనిపించడం
- తినగానే నిండిపోయిన భావన
- తలనొప్పి
- నిద్ర సరిగా రాకపోవడం
గ్యాస్ట్రిక్(gastric)వెనుక దాగి ఉండే సమస్యలు.
తరచూ గ్యాస్ట్రిక్ వస్తుంటే ఇవి కారణం కావచ్చు:
- ఆమ్లత్వం (Acidity)
- గ్యాస్ట్రైటిస్ (Gastritis)
- అల్సర్ ప్రారంభ దశ
- లివర్ సమస్యలు
- H. pylori ఇన్ఫెక్షన్( infection)
అందుకే గ్యాస్ట్రిక్ ని లైట్‌గా తీసుకోవద్దు అని చూపుతున్న.
రోజూ మాత్రలు(tablets)వేసుకోవడం సరైనదా?
గ్యాస్ మాత్రలు తాత్కాలిక ఉపశమనమే ఇస్తాయి.
కానీ
👉 సమస్యను దొరంచేయవు
👉 దాని వేరే కారణాన్ని కూడా బయటకు పెటవు.
దీర్ఘకాలంగా వాడితే
* జీర్ణశక్తి మరింత బలహీనపడుతుంది
* ఇతర ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.
గ్యాస్ట్రిక్ సమస్య తగ్గాలంటే ఏమి చేయాలి?(పరిష్కారం)
1) ఆహార మార్పులు.
✔️సమయానికి తినడం
✔️ ఎక్కువగా నూనె (oil)లో వేయించిన ఆహారం తగ్గించండి
✔️ కూరగాయలు, ఆకుకూరలు పెంచండి
✔️ తినడం అయ్యాక పెరుగు, మజ్జిగ తీసుకోండి.
2) జీవనశైలి మార్పులు.
✔️ రోజూ నడక(walking)
✔️ సరిపడా నిద్ర (8:00. hours) mix
✔️ Stress తగ్గించే అలవాట్లు
✔️ తినగానే పడుకోకుండా 2 hours time spend చేయండి.
ఎప్పుడు డాక్టర్‌ను కలవాలి?
ఈ లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకండి
- రోజూ గ్యాస్ట్రిక్
- వాంతుల్లో రక్తం
- బరువు అకస్మాత్తుగా తగ్గడం
- తినలేని పరిస్థితి
ఇవి ప్రమాద సంకేతాలు కావచ్చు. ఆలస్యం చేయకుండా doctor ni సంప్రదించండి.
ముగింపు .
గ్యాస్ట్రిక్ అనేది చిన్న సమస్య కాదు…
👉 ఇది శరీరం ఇస్తున్న ముందస్తు హెచ్చరిక.
ఈ రోజు మీరు పట్టించుకోకపోతే,
రేపు అది పెద్ద జబ్బుగా మారుతుంది.
👉 కారణం తెలుసుకోండి
👉 అలవాట్లు మార్చుకోండి
👉 ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి …
Disclaimer.
ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. లక్షణాలు కొనసాగితే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి..
ఆరోగ్యం మహాభాగ్యం.
ఇలాంటి మారినీ ఆరోగ్య సంచరకోసం
తెలుసుకోండి..