
డయాబెటిస్ (Sugar) ఉన్న చాలా మందికి ఇది జీవితంలో ఒక్కసారైనా జరిగే విషయం.
రోజూ సమయానికి తీసుకునే Sugar Tablet ఒక రోజు మర్చిపోతుంటాం అప్పుడే భయం మొదలవుతుంది…
“ఇప్పుడు ఏమవుతుందో ఏమో?”
“డబుల్ డోస్ వేసుకోవాలా వద్ద?”
“షుగర్ పెరిగి పోతుందేమో అనే టెన్షన్?”
ఇలాంటి సందేహాలే చాలా మందిని తప్పు నిర్ణయాల వైపు నడిపిస్తాయి.
ముందుగా ఒక నిజం తెలుసుకోండి.
ఒక్క రోజు టాబ్లెట్ మిస్ అవ్వడం వల్ల వెంటనే ప్రమాదం జరగదు.
కానీ ఆ రోజు మీరు చేసే తప్పు పని మాత్రం ప్రమాదాన్ని తెచ్చి పెట్టవచ్చు.
Sugar Tablet మర్చిపోయిన రోజున ముందుగా ఇదొక్కటే చేయండి.
శాంతంగా ఉండండి (Don’t Panic)
భయం వల్ల చాలా మంది
❌ డబుల్ డోస్ వేసుకుంటారు
❌ తినడం మానేస్తారు
❌ గెస్ చేసి మందులు మార్చేస్తారు
ఇవన్నీ చేయకూడని తప్పులు.
తర్వాత చేయాల్సిన సరైన STEPS ఇవి. 👇
1) ఎంత టైమ్ అయిందో గుర్తు పెట్టుకోండి. మీరు టాబ్లెట్ మర్చిపోయిన విషయం
కొన్ని గంటల్లోనే గుర్తొచ్చిందా?
👉 ఇంకా తదుపరి డోస్ టైమ్ దూరంగా ఉంటే, డాక్టర్ చెప్పిన విధంగా తీసుకోవచ్చు
లేదా
తదుపరి డోస్ టైమ్ దగ్గర అయిపోయిందా?
ఐతే మిస్ అయిన డోస్ ను వదిలేయండి
👉 ఎప్పటికీ డబుల్ డోస్ వేసుకోకండి.
2) డబుల్ డోస్(double dose) ఎందుకు ప్రమాదం?
ఇది చాలా ముఖ్యమైన విషయం
డబుల్ డోస్ వల్ల
- షుగర్ అకస్మాత్తుగా పడిపోవచ్చు (Low Sugar)
- తల తిరగడం
- చెమటలు పట్టడం
- వణుకు పట్టడం
- స్పృహ కోల్పోవడం కూడా జరగొచ్చు
Low Sugar, High Sugar కంటే ఇంకా ప్రమాదకరం.
3) ఆ రోజు మీ ఆహారమే మీ ఔషధం లా మార్చుకోవాలి
Sugar Tablet మిస్ అయిన రోజు
మీరు తినే ఆహారమే Sugar నీ కంట్రోల్ చేస్తుంది.
- బియ్యం, చక్కెర, స్వీట్స్ తగ్గించండి
- కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినండి
- పండ్లు కూడా పరిమితంగా మాత్రమే
- Cool drinks, bakery foods అసలు తినకండి.
4) నడక (Walking) తప్పనిసరి
Tablet మిస్ అయిన రోజు
20–30 నిమిషాలు నడక
ఇది షుగర్ Spike అవకుండా చాలా సహాయ పడుతుంది.
కానీ
* అలసిపోయేంత వ్యాయామం
* ఖాళీ కడుపుతో Heavy exercise వద్దు.
5) వీలైతే షుగర్ లెవెల్ చెక్ చేసుకోండి .
అందుబాటులో ఉంటే
* Random Sugar
లేదా
* Fasting / PP (డాక్టర్ చెప్పినట్లు)
లెవెల్స్ ఎక్కువగా ఉంటే
👉 డాక్టర్‌కు చెప్పండి
👉 మీ ఇష్టం వచ్చినట్టు మందులు మార్చకండి
ఎప్పుడు వెంటనే జాగ్రత్త తీసుకోవాలి?
- తల తిరగడం
- ఎక్కువ చెమటలు
- చేతులు వణకడం
- బలహీనంగా అనిపించడం
ఇవి Low Sugar సంకేతాలు కావచ్చు.
తరచూ Sugar Tablet మర్చిపోతున్నారా?
ఇది పెద్ద హెచ్చరిక (alert)
Diabetes కంట్రోల్ తప్పుతోందని అర్థం.
మర్చిపోకుండా ఉండేందుకు చిన్న చిట్కాలు
✔️రోజూ ఒకే టైమ్‌కు అలారం
✔️ Pill Box వాడండి
✔️ భోజనం తర్వాతే టాబ్లెట్ అలవాటు
✔️ Mobile reminder App
చివరిగా. Sugar Tablet మర్చిపోవడం తప్పు కాదు…
కానీ మర్చిపోయిన తర్వాత చేసే తప్పులు మరి నిర్ణయాలే ప్రమాదం.
Disclaimer.
ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే.
మీకు ఇచ్చిన షుగర్ మందుల విషయంలో మార్పులు చేయాలంటే తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించండి.
మరింత తెలుసుకోండి.