Telegram Join My Telegram   WhatsApp Join My WhatsApp

కేంద్ర ప్రభుత్వం నుంచి గర్భిణీ స్త్రీల కోసం కొత్త పథకం.! -పూర్తి వివరాలు/Pregnant ఉనవలు తెలుసుకోవలసిన సమాచారం.

భారతదేశంలో గర్భిణీ స్త్రీల ఆరోగ్యం దేశ భవిష్యత్తు పై ముడిపడి ఉంటుంది. గర్భధారణ సమయంలో సరైన పోషణ, వైద్యం, ఆర్థిక భద్రత లేకపోతే తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రమాదాలు ఎదురవుతాయి. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తోంది. వాటిలో ముఖ్యమైనది ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY). ఈ పథకం గర్భిణీ స్త్రీలకు ఆర్థికంగా సహాయం అందించి సురక్షిత గర్భధారణకు భరోసా ఇస్తుంది.

1) PMMVY పథకం అంటే ఏమిటి?

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) అనేది కేంద్ర ప్రభుత్వ (central government) పథకం.
ఈ పథకం ద్వారా గర్భిణీ స్త్రీలకు గర్భధారణ సమయంలో మరియు ప్రసవం తర్వాత డబుల్ని నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం.

ఈ పథకం ముఖ్య లక్ష్యాలు:

  • గర్భిణీ స్త్రీలకు సరైన పోషణ అందించడం
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో( GOVT HOSPITAL) ప్రసవాలను ప్రోత్సహించడం
  • తల్లి, శిశు మరణాల శాతం తగ్గించడం
  • గర్భధారణ సమయంలో ఆర్థిక ఒత్తిడి నీ తగ్గించడం.

2) PMMVY ద్వారా ఎంత డబ్బు వొస్తుంది ?

ఈ పథకం కింద గర్భిణీ స్త్రీలకు మొత్తం ₹5,000 ఇస్తారు.

కానీ .
ఈ మొత్తని దశల వారీగా విభజించి చెల్లిస్తారు.

చెల్లింపు విధానం:

  • గర్భధారణ సమయంలో మొదటి దశలో ఒకసారి
  • గర్భధారణ రెండోవ దశలో ఒకసారి
  • ప్రసవం తర్వాత దశ ఒకసారి 

ఇలా డబ్బులు నేరుగా pregnant ఉన్న మహిళల బ్యాంక్ ఖాతాలోనే జమ అవుతాయి.

3) Pregnant ఉన్నవాళ్లు ఎందుకు ఈ పథకం గురించి తెలుసుకోవాలి?

చాలా మంది మహిళలకు ఈ పథకం గురించి తెలియక:


a) Govt నుంచి వస్తున్న ఉచిత డబ్బులు నీ కోల్పోతున్నారు.

b) ప్రభుత్వ వైద్య సేవలు ఉపయోగించు కోవడం లేదు.

ఈ పథకం తెలుసుకుంటే:

  • గర్భధారణ సమయం లో ఖర్చులకు సహాయం అవుతుంది
  • మంచి వైద్యం దొరుకుతుంది
  • సురక్షిత ప్రసవం అవడానికి సాధ్యం పడుతుంది.

4) గర్భిణీ స్త్రీలకు అందించే వైద్య సేవలు:

PMMVY పథకం కింద నమోదు చేసుకున గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రి (govt hospital) లో ఈ సేవలు అందుతాయి:

  • రెగ్యులర్ ANC చెకప్‌లు
  • రక్తపరీక్షలు మరియు స్కానింగ్(scanning)
  • ఐరన్(iron), కాల్షియం(calcium) మాత్రలు
  • గర్భధారణ సమయంలో పాటించాల్సిన టీకాలు(tips)
  • పోషణపై అవగాహన కల్పించడం

ఈ సేవలన్నీ తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉపయోగపడతాయి.

5) ఎవరికీ అర్హత ఉంటుంది?

సాధారణంగా ఈ పథకం పొందాలంటే:

  • గర్భిణీ స్త్రీ అయ్యుండాలి భారత పౌరురాలు కావాలి
  • ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ( Pregnant)గా నమోదు అయి ఉండాలి
  • ఆధార్‌ కార్డు తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా(bank account) ఉండాలి
  • ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.

అర్హతల్ని మీ రాష్ట్రం ఆధారంగా కొద్దిగా మారవచ్చు.

6) ఎలా నమోదు చేసుకోవాలి?

నమోదు చేసుకునే విధానం:👇

  • సమీప ప్రభుత్వ ఆసుపత్రి లో లేదా
  • ఆంగన్‌వాడీ కేంద్రంకు వెళ్లాలి
  • అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వాలి
  • ANC Card తీసుకోవాలి

అక్కడి సిబ్బంది మీ వివరాలను పథకంలో నమోదు చేస్తారు.

అవసరమైన పత్రాలు (documents):

* ఆధార్ కార్డు(Aadhar card)
* బ్యాంక్ పాస్‌ బుక్(bank passbook) కాపీ
* గర్భిణీ కార్డు (ANC Card)
* రేషన్ కార్డు (ration card)

7) ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు/లాభాలు.

  • గర్భిణీ స్త్రీలకు ఆర్థిక భరోసా
  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో సురక్షిత ప్రసవం
  • తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది
  • బిడ్డకు మంచి ఆరంభం/ఆరోగ్యం లభిస్తుంది.

Conclusion:

ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) గర్భిణీ స్త్రీలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమైన పథకం. Pregnant ఉన్న ప్రతి మహిళ ఈ పథకం గురించి తెలుసుకుని, సరైన సమయంలో నమోదు చేసుకుంటే ఆర్థిక సహాయం, వైద్య సేవలు రెండింటినీ పొందవచ్చు. ఇది కేవలం డబ్బుల పథకం కాదు—తల్లి, బిడ్డ  భవిష్యతుకు భరోసా.

Disclaimer:


ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. పథకం నిబంధనలు రాష్ట్రం మరియు తాజా ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా మారవచ్చు. ఖచ్చితమైన వివరాల కోసం సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా ఆంగన్‌వాడీ కేంద్రాన్ని సంప్రదించండి.

Leave a Comment