Telegram Join My Telegram   WhatsApp Join My WhatsApp

ఈ ఒక్క చిన్న పరీక్ష మీ Kidneys ను కాపాడుతుంది..! 30 తర్వాత డాక్టర్లు చెప్పే ముఖ్యమైన సూచన.!

30 ఏళ్ల తర్వాత Kidneys పరీక్షలు తప్పనిసరి..! భారతదేశంలో పెరుగుతున్న కిడ్నీ వ్యాధులపై నిపుణుల హెచ్చరిక ఆలస్యం ఐతే ప్రాణాలకే ప్రమాదం.

మన శరీరంలో Kidneys అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. రక్తాన్ని శుభ్రపరచడం, శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడం, నీటి సమతుల్యతను నియంత్రించడం వంటి అనేక ముఖ్యమైన పనులను కిడ్నీలు నిర్వహిస్తాయి. అయినప్పటికీ చాలా మంది కిడ్నీ ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. సాధారణంగా తీవ్రమైన లక్షణాలు కనిపించినప్పుడు మాత్రమే పరీక్షలు చేయించుకోవాలని అనుకుంటారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం కిడ్నీ వ్యాధులు చాలా కాలం పాటు ఎలాంటి లక్షణాలు చూపకుండా నెమ్మదిగా పెరుగుతాయి. అందుకే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.

భారతదేశంలో ప్రస్తుతం కిడ్నీ వ్యాధుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా Chronic Kidney Disease (CKD) అనే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి కేసులు గత దశాబ్దంలో వేగంగా పెరిగాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం 2011 నుంచి 2017 మధ్యకాలంలో దేశంలో ఈ వ్యాధి ప్రభావం సుమారు 11 శాతం వరకు ఉండేది. అయితే 2018 నుంచి 2023 మధ్యకాలంలో ఇది 16 శాతం కంటే ఎక్కువకు పెరిగినట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ పెరుగుదల ఆరోగ్య రంగంలో పెద్ద ఆందోళనగా మారింది. ముఖ్యంగా యువతలో కూడా ఈ సమస్యలు కనిపించడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

కాలక్రమేనంగా కిడ్నీ వ్యాధులు ఎక్కువగా వృద్ధాప్యంలో కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ తగ్గిపోవడం, అధికంగా Processed food తీసుకోవడం వంటి కారణాల వల్ల 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిలో కూడా Kidney సమస్యలు పెరుగుతున్నాయి. అందుకే వైద్యులు 30 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా కిడ్నీ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ముందుగానే పరీక్షలు చేయించుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ఉంటుంది.

కిడ్నీలు శరీరంలో ఉన్న రక్తాన్ని నిరంతరం ఫిల్టర్ చేస్తాయి. ఈ ప్రక్రియలో వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అదనంగా శరీరంలో ఉండే నీటి మరియు ఖనిజాల సమతుల్యతను కూడా కిడ్నీలు నియంత్రిస్తాయి. ఈ వ్యవస్థలో ఏదైనా సమస్య ఏర్పడితే శరీరంలో విషపదార్థాలు నిల్వ కావడం ప్రారంభమవుతుంది. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే కిడ్నీ వ్యాధి ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలా మంది సమస్యను గుర్తించలేరు.

ఇప్పటి జీవనశైలి కూడా కిడ్నీ ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతోంది. నగరాల్లో ఎక్కువసేపు కూర్చుని పని చేయడం, వ్యాయామం చేయకపోవడం, అధికంగా జంక్ ఫుడ్ తీసుకోవడం వంటి అలవాట్లు కిడ్నీలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అదనంగా Diabetes మరియు Blood pressure సమస్యలు కూడా కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం లేదా రక్తపోటు నియంత్రణలో లేకపోవడం వల్ల కిడ్నీ లోని సున్నితమైన రక్తనాళాలు క్రమంగా దెబ్బతింటాయి. దీని వల్ల కిడ్నీ పనితీరు తగ్గిపోతుంది.

Kidney వ్యాధి ప్రమాదకరంగా మారడానికి ప్రధాన కారణం ఇది చాలా కాలం వరకు లక్షణాలు చూపించ కపోవడం. చాలా మంది తమకు ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ లోపల కిడ్నీలు నెమ్మదిగా దెబ్బతింటూ ఉంటాయి. లక్షణాలు కనిపించే సమయానికి కిడ్నీ పనితీరు గణనీయంగా తగ్గిపోయి ఉండవచ్చు. అందుకే వైద్యులు ముందుగానే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా కొన్ని Blood tests and urine tests ద్వారా కిడ్నీ ఆరోగ్యాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.

Kidneys కి వచ్చే వ్యాధికి ప్రధాన కారణాలు.

ప్రస్తుతం మన భారతదేశంలో కిడ్నీ వ్యాధులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జీవనశైలి మరియు ఆరోగ్య సమస్యలు కలిసి ఈ ప్రమాదాన్ని పెంచుతున్నాయి. కిడ్నీలకు హాని కలిగించే ప్రధాన కారణాలు ఇవి:

  • మధుమేహం (Diabetes)
  • అధిక రక్తపోటు (High Blood Pressure)
  • అధిక బరువు లేదా (Obesity)
  • అధిక ఉప్పు ఉన్న ఆహారం
  • పొగ త్రాగడం( Smoking )
  • తరచుగా painkiller మందులు వాడటం
  • కుటుంబంలో కిడ్నీ వ్యాధి చరిత్ర ఉండటం

ఈ కారణాలు ఎక్కువకాలం కొనసాగితే కిడ్నీలు క్రమంగా దెబ్బతింటాయి.

ఇప్పటికీ ఇండియాలో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలకు మరో కారణం కూడా ఉంది. కలుషితమైన నీరు, అధిక వేడి వాతావరణం, తగినంత నీరు తాగకపోవడం వంటి అంశాలు కూడా కిడ్నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా వ్యవసాయ కార్మికులు ఎక్కువసేపు ఎండలో పని చేయడం వల్ల డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటారు. దీని వల్ల కిడ్నీల పై అదనపు ఒత్తిడి పడుతుంది.

కిడ్నీ వ్యాధి ప్రారంభ దశలో లక్షణాలు ఎక్కువగా కనిపించకపోయినా, వ్యాధి ముందుకు సాగినప్పుడు కొన్ని సంకేతాలు కనిపించవచ్చు. ఉదాహరణకు కాళ్లలో వాపు రావడం, తరచుగా అలసట అనిపించడం, మూత్రంలో మార్పులు కనిపించడం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొంతమందిలో ఆకలి తగ్గడం లేదా రాత్రి సమయంలో ఎక్కువసార్లు మూత్రం రావడం కూడా కిడ్నీ సమస్యలకు సంకేతాలు కావచ్చు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.

Kidneys గురించి మరికొంత తెలుసుకోవడానికి దీన్ని చదవండి 👇

నీటితో పాటు ఈ సహజ పదార్థాలు తీసుకుంటే… మీ Kidneys ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి!

Kidney ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాలు.

సరైన జీవనశైలి పాటించడం ద్వారా కిడ్నీ వ్యాధి ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. ముఖ్యంగా ఈ అలవాట్లు పాటించడం కిడ్నీ ఆరోగ్యానికి మంచివి:

  • రోజూ తగినంత నీరు తాగడం
  • Blood pressure మరియు Blood sugar నీ నియంత్రణలో ఉంచడం
  • సమతుల ఆహారం తీసుకోవడం
  • అధిక ఉప్పు ఉన్న ఆహారం తగ్గించడం
  • రోజూ వ్యాయామం చేయడం
  • డాక్టర్ సలహా లేకుండా మందులు తీసుకోకపోవడం

ఈ సాధారణ అలవాట్లు కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా సహాయపడతాయి.

ప్రస్తుతం భారతదేశంలో కిడ్నీ వ్యాధులపై అవగాహన పెరగడం చాలా అవసరం. చాలామంది తీవ్రమైన లక్షణాలు కనిపించిన తర్వాత మాత్రమే పరీక్షలు చేయించుకుంటారు. కానీ అప్పటికే వ్యాధి ముందుకు సాగి ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఆరోగ్యంపై ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా 30 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.

ఆరోగ్యం మహాభాగ్యం

Leave a Comment