భారతదేశంలో మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటి సర్వికల్ క్యాన్సర్ (Cervical Cancer). ప్రతి సంవత్సరం వేలాది మహిళలు ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణం Human papilloma virus (HPV) అనే వైరస్. ఈ వైరస్ నుండి రక్షణ పొందడానికి ప్రపంచవ్యాప్తంగా HPV Vaccine ను ఉపయోగిస్తున్నారు.
ఇప్పటికే చాలా దేశాల్లో ఈ వ్యాక్సిన్ ను జాతీయ టీకా కార్యక్రమాల్లో భాగంగా అమలు చేస్తున్నారు. భారత్ లో కూడా ఈ వ్యాక్సిన్ ను Universal Immunisation Programme (UIP) లో చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది.
భారతదేశంలో తయారైన Cervavac HPV Vaccine ను జాతీయ టీకా కార్యక్రమంలో చేర్చే ప్రక్రియ కొంత ఆలస్యం అవుతోంది. అదే సమయంలో ఇప్పటికే మార్కెట్ లో ఉన్న Gardasil-4 vaccine తో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్పులు, ప్రభుత్వ వ్యూహం, మరియు భవిష్యత్తులో Cervavac కి ఉన్న అవకాశాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
HPV Virus అంటే ఏమిటి ?
HPV అంటే Human Papilloma Virus. ఇది సాధారణంగా లైంగిక సంబంధాల ద్వారా వ్యాప్తి చెందే వైరస్. ఈ వైరస్ కు 100 కంటే ఎక్కువ రకాలున్నాయి. వాటిలో కొన్ని ప్రమాదకరం కాకపోయినా, కొన్ని మాత్రం తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి.
ముఖ్యంగా HPV వైరస్ లో ని కొన్ని రకాల వల్ల Cervical cancer వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ క్యాన్సర్ మహిళల గర్భాశయ ద్వారం భాగంలో ఏర్పడుతుంది.
భారతదేశంలో ఈ వ్యాధి ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకపోవడం, పరీక్షలు చేయించుకోక పోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత పెరుగుతోంది.
అందుకే ప్రభుత్వాలు HPV వ్యాక్సిన్‌ను చిన్న వయస్సులోనే ఇవ్వాలని నిర్ణయించాయి. ముఖ్యంగా 9 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలికలకు ఈ టీకా ఇవ్వడం అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది.
భారత్‌లో HPV Vaccine ప్రోగ్రామ్ ప్రారంభం.
భారత ప్రభుత్వం చాలా కాలంగా HPV vaccine ను జాతీయ టీకా కార్యక్రమంలో చేర్చే ప్రణాళికలో ఉంది. 2023లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ Program కు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది.
2026 నాటికి దేశవ్యాప్తంగా బాలికలకు HPV వ్యాక్సిన్ ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి Narendra Modi ఫిబ్రవరి 28న రాజస్థాన్‌లో ని Ajmer లో ఒక పెద్ద ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సుమారు 1.15 కోట్ల 14 సంవత్సరాల బాలికలకు HPV టీకా ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ టీకా కార్యక్రమంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్నది Gardasil‑4 అనే Vaccine.
Gardasil-4 Vaccine గురించి.
Gardasil-4 అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే HPV vaccine. దీన్ని అమెరికా కంపెనీ Merck అభివృద్ధి చేసింది.
ఈ వ్యాక్సిన్ 2009 నుండి భారత్ లో అందుబాటులో ఉంది.
ఈ వ్యాక్సిన్ ముఖ్యంగా HPV వైరస్‌లో ని నాలుగు ప్రమాదకర రకాల నుంచి రక్షణ ఇస్తుంది. ముఖ్యంగా HPV-16 మరియు HPV-18 అనే Types of viruses ఎక్కువగా Cervical cancer కు కారణం అవుతాయి.
అందుకే ఈ రెండు వైరస్‌లను లక్ష్యంగా చేసుకుని Gardasil-4 ను ప్రపంచంలోని చాలా దేశాలు తమ టీకా కార్యక్రమాల్లో ఉపయోగిస్తున్నాయి.
ఇండియా తయారీ Cervavac Vaccine.
భారతదేశంలో కూడా HPV vaccine అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరిగాయి.
దీని ఫలితంగా Cervavac అనే వ్యాక్సిన్ తయారైంది.
ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన సంస్థ Serum Institute of India.
ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్య సంస్థలు కూడా ఉన్నాయి:
- Department of Biotechnology
- Biotechnology Industry Research Assistance Council
- Bill & Melinda Gates Foundation
ఈ వ్యాక్సిన్‌ను 2022 సెప్టెంబర్‌లో అధికారికంగా ప్రారంభించారు.
అప్పుడు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి Jitendra Singh ఈ Vaccine ను భారతదేశంలో తయారైన గొప్ప శాస్త్రీయ విజయంగా పేర్కొన్నారు.
Cervavac ధర తక్కువగా ఉండటం.
Cervavac vaccine లో ముఖ్యమైన ప్రయోజనం ధర తక్కువగా ఉండటం.
Serum Institute CEO Adar Poonawalla ప్రకారం, ప్రభుత్వ కొనుగోలు ప్రక్రియలో భాగంగా ఈ వ్యాక్సిన్ ధర ఒక్క Dose కు సుమారు ₹200 నుండి ₹400 మధ్య ఉండవచ్చు.
ఇది మార్కెట్‌లో ఉన్న ఇతర HPV వ్యాక్సిన్‌లతో పోలిస్తే చాలా తక్కువ.
దీని వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది బాలికలకు తక్కువ ఖర్చుతో టీకా అందించవచ్చని భావించారు.
అయితే Cervavac ఎందుకు ఆలస్యం అవుతోంది?
Cervavac vaccine ను జాతీయ టీకా కార్యక్రమంలో చేర్చే ప్రక్రియ ప్రస్తుతం కొంత ఆలస్యం అవుతోంది.
దానికి ప్రధాన కారణం ఒక ముఖ్యమైన శాస్త్రీయ అధ్యయనం.
ఈ అధ్యయనాన్ని నిర్వహిస్తున్న సంస్థ Indian Council of Medical Research.
ICMR ప్రస్తుతం ఒక కీలకమైన ప్రశ్నకు సమాధానం కనుగొనే ప్రయత్నం చేస్తోంది.
Cervavac వ్యాక్సిన్ ఒకే డోస్ ఇచ్చినా సరిపోతుందా?
లేదా రెండు డోసులు అవసరమా?
ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రస్తుతం పరిశోధన జరుగుతోంది.
WHO మార్పులు చేసిన డోస్ విధానం.
ముందు వరకు HPV వ్యాక్సిన్ కోసం రెండు Dose లు తప్పనిసరి అని సూచించారు.
9 నుండి 15 సంవత్సరాల మధ్య బాలికలకు రెండు Dose లు ఇవ్వడం ద్వారా సరైన రక్షణ లభిస్తుందని భావించారు.
కానీ 2022లో World Health Organization ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
అధ్యయనాలు పరిశీలించిన తర్వాత WHO ఒక కొత్త సిఫార్సు చేసింది.
దేశాలు తమ టీకా కార్యక్రమాల్లో:
ఒకటి లేదా రెండు డోసులు
ఇవ్వవచ్చని సూచించింది.
World Health Organization
ఉచిత వ్యాక్సిన్ వల్ల వచ్చిన ప్రభావం.
GAVI అందించిన ఉచిత వ్యాక్సిన్‌ల కారణంగా ప్రభుత్వం తక్షణంగా Gardasil-4 ను ఉపయోగించి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ నిర్ణయం వల్ల Cervavac కొంతకాలం వెనుకబడింది.
ఇది పూర్తిగా శాశ్వత నిర్ణయం కాదు.
ICMR అధ్యయనం పూర్తయ్యాక Cervavac కూడా కార్యక్రమంలో చేరే అవకాశం ఉంది.
భారత్‌లో సర్వికల్ క్యాన్సర్ పరిస్థితి.
భారతదేశంలో సర్వికల్ క్యాన్సర్ ఒక పెద్ద ప్రజారోగ్య సమస్య.
ప్రతి సంవత్సరం:
- సుమారు 80,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి
- 42,000 మహిళలు ఈ వ్యాధితో మరణిస్తున్నారు
ప్రపంచవ్యాప్తంగా సర్వికల్ క్యాన్సర్ భారంలో భారత్ ఒక్కదే దాదాపు 20% వాటా కలిగి ఉంది.
ఈ పరిస్థితి దృష్ట్యా HPV వ్యాక్సిన్ కార్యక్రమం చాలా కీలకం.
భారత్‌లో లక్ష్యంగా ఉన్న బాలికల సంఖ్య.
National Family Health Survey అంచనాల ప్రకారం భారత్‌లో:
9 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలికలు సుమారు 8 నుండి 10 కోట్ల వరకు ఉంటారు.
అందుకే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం ఒక పెద్ద సవాలు.
అయితే ఇది విజయవంతమైతే భవిష్యత్తులో Cervical cancer ను పెద్ద మొత్తంలో తగ్గించే అవకాశం ఉంది.
1 thought on ““Cervical cancer నివారణకు HPV Vaccine… కానీ ఇండియా Vaccine Cervavac ఆలస్యం ఎందుకు?””