
ఈ రోజుల్లో Heart attack అనే మాట వినాలివాలు లేరు చిన్న వాళ్లకి కూడా భయంగా మారింది. వయస్సుతో సంబంధం లేకుండా 25–30 ఏళ్ల యువత కూ కూడా గుండెపోటు వస్తోంది. “నేను ఆరోగ్యంగానే ఉన్నాను”, “నాకు షుగర్ లేదు”, “బీపీ లేదు” అని అనుకునే వాళ్లకే ఒక్కసారిగా హార్ట్ అటాక్ రావడం చూస్తూనే ఉన్నాం.
అయితే, ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏమైఉంటుంది ?
మందులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా, పెద్ద కష్టాలు పడకుండా .మనం చేయగల ఒక్క చిన్న పని ఏదంటే ?
1) రోజూ కి కనీసం 30 నిమిషాలు నడక (Walking) – ఇదే ఆ చిన్న పని.
ఇది వినడానికి చాలా సాధారణంగా అనిపించవచ్చు. కానీ వైద్య పరిశోధనలు చెబుతున్న నిజం ఏమిటంటే, రోజూ నడక(walking)అలవాటు ఉన్నవారిలో Heart attack వచ్చే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది అని డాక్టర్లు చూపుతూ ఉనారు..!
2) Heart attack అసలు ఎందుకు వస్తుంది? ఎపుడైన ఆలోచించారా.?
హార్ట్ అటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవి👇
:- రక్తనాళాల్లో కొవ్వు (Cholesterol) పేరుకుపోవడం
:- రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం
:- అధిక బీపీ
:- షుగర్( diabits )
:- పొగతాగడం( smoking )
:- శారీరక కదలికలు లేకపోవడం (Sedentary lifestyle)
ఇవన్నీ కలిసి గుండె మీద ఒకసారిగా ఒత్తిడి పెడతాయి. చివరికి గుండెకు వేలే రక్తం నాళాలలో Cholesterol పెరిగి రక్తం సప్లయ్ తగ్గి పోవడంతో హార్ట్ అటాక్ వస్తుంది.
3) 🚶♂️ నడక (walking) వల్ల గుండెకు ఏం లాభం?
రోజూ 30 నిమిషాలు నడిస్తే శరీరంలో జరిగే మార్పులు అద్భుత మైనవి:
a) చెడు కొలెస్ట్రాల్(Waste cholesterol) తగ్గుతుంది
నడక వల్ల LDL (చెడు కొలెస్ట్రాల్) తగ్గి, HDL (మంచి కొలెస్ట్రాల్) పెరుగుతుంది.
b) రక్త ప్రసరణ(suplly)మెరుగుపడుతుంది
గుండె శక్తివంతంగా(. pump )పంపింగ్ చేస్తుంది. రక్తనాళాలు శుభ్రంగా ఉంటాయి.
c) బీపీ(B P) నియంత్రణ లో ఉంటుంది
రోజూ నడిచే వాళ్లలో హై బీపీ సమస్య చాలా తక్కువగా మందికి ఉంటుంది.
d) Sugar levels కంట్రోల్ లో ఉంటాయి
షుగర్(diabits)ఉన్నవాళ్లకు కూడా నడక ఒక సహజ ఔషధంలా పనిచేస్తుంది.
e)ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారిలో బరువు తగ్గుతుంది
f) Obesity హార్ట్ అటాక్‌కు పెద్ద ప్రమాదం. నడక బరువును క్రమంగా తగ్గిస్తుంది.
4) మానసిక ఒత్తిడి కూడా Heart attack కు కారణమే.
చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, Stress (ఒత్తిడి) కూడా గుండెను దెబ్బతీస్తుంది.
రోజూ నడక చేయడం వల్ల:
:- మనసు ప్రశాంతంగా ఉంటుంది
:- నిద్ర బాగా పడుతుంది
:- కోపం, (ఒత్తిడి) ఆందోళన తగ్గుతాయి
ఈ మానసిక మార్పులు కూడా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
5) నడవడానికి బెస్ట్ టైమ్ ఏది?
ఉదయం ఖాళీ కడుపుతో(empty stomach) నడిస్తే చాలా మంచిది
ఉదయం కుదరకపోతే, సాయంత్రం కూడా నడవొచ్చు
ముఖ్యమైనది(important) మానకుండా రోజూ చేయడం, టైమ్ కాదు
రోజుకు ఒకసారైనా 30 నిమిషాలు కుదరకపోతే:
ఉదయం 15 నిమిషాలు
సాయంత్రం 15 నిమిషాలు
ఇలా రెండు భాగాలుగా కూడా చేయొచ్చు.
6) చాలామంది చేసే తప్పులు.!
a) “నాకు టైమ్ లేదు” TIME దొరకట్లేదు అనడం
b) “GYM కు వెళ్తేనే ఉపయోగం” అనుకోవడం
c) వయస్సు పెరిగాక చేస్తే సరిపోతుంది అని వేలకుండా ఉండడం .
నిజం ఏమిటంటే, జిమ్ అవసరం లేదు, ఖరీదైన పరికరాలు అవసరం లేదు. సరైన Shoes వేసుకుని బయట 30 నిమిషాలు నడిస్తే చాలు.
7) ఎవరు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండాలి ?
ఈ లక్షణాలు ఉన్నవాళ్లు తప్పకుండా నడక అలవాటు చేసుకోవాలి:
1) కుటుంబంలో Heart attack హిస్టరీ ఉండేవాళ్ళు.
2) Sugar లేదా BP ఉన్నవాళ్లు
3) రోజంతా కూర్చునే ఉద్యోగాలు చేసే వాళ్లు
4) పొగ తాగేవాళ్లు(SMOKING) అలవాటు ఉనవలు.
ఇవాళ నడవడం మొదలుపెడితే రేపటి రోజు వోచ్ Heart attack ను ఆపగలుగుతారు.
✔️చివరిగా ఒక ముఖ్యమైన మాట.
Heart attack ఒక్కరోజులో రాదు.
రోజూ మనం చేసే చిన్న చిన్న తప్పులే పెద్ద ప్రమాదంగా మారుతాయి.
అలాగే,
👉 రోజూ చేసే ఒక్క చిన్న మంచి పని – నడక – మీ ప్రాణాలను కాపాడగలదు.
ఈరోజే మొదలుపెట్టండి.
“రేపటి నుంచి” అనేది గుండెకు నచ్చదు ❤️
“మీ ఆరోగ్యం ఎపుడు మీ చేతిలోనే ఉంటుంది”
ఆరోగ్యం తెలుగు .
డిస్క్లైమర్:
ఈ కంటెంట్ అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులు వ్యక్తి వ్యక్తికి భిన్నంగా ఉండవచ్చు. ఏవైనా లక్షణాలు లేదా సందేహాలు ఉంటే Eligibility ఉన్న వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.