
చాలా మందికి ఎదురయ్యే సమస్య కానీ మాట్లాడడానికి ఇబ్బంది చెప్పుకోవడానికి ఇబ్బందిగా అనిపించే సమస్యల్లో ఇది కూడా ఒకటి తొడల మధ్య ఎర్ర మచ్చలు, మరి తీవ్రమైన దురద . మొదట చిన్నగా మొదలై, పట్టించుకోకపోతే రోజు రోజుకీ పెరుగుతూ ఉంటుంది మరి అసౌకర్యంగా మారిపోతుంది. చాలామంది దీనిని సాధారణ అలర్జీ లేదా వేడి వల్ల వచ్చిందని అనుకుంటారు. కానీ ఎక్కువ సందర్భాల్లో ఇది టినియా క్రూరిస్ (Tinea Cruris) అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు.
1) టినియా క్రూరిస్ అంటే ఏమిటి?
Tinea cruris అనేది ఒక రకమైన ఫంగస్ వల్ల వచ్చే చర్మ రోగం. దీనిని సాధారణంగా Jock Itch అని కూడా పిలుస్తారు. ఇది ముఖ్యంగా తొడల మధ్య భాగం లో,Privet ప్రాంతాల చుట్టూ, నడుము దేగ్గర ఎక్కువగా కనిపిస్తుంది. వేడి, తేమ ఎక్కువగా ఉండే ప్రాంతం లో ఈ ఫంగస్ సులభంగా పెరుగుతుంది.
2) ఈ సమస్య ఎందుకు వస్తుంది?
టినియా క్రూరిస్ రావడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి:
* ఎక్కువసేపు చెమట పట్టడం
* privet భాగాలు తడి గా ఉంచడం
* టైట్ Underwear లేదా Non-cotton దుస్తులు వాడడం
శుభ్రత లేనపుడు
* ఒబేసిటీ (obesity)
* డయాబెటిస్ ఉన్నవారిలో
* ఇతరులకు ఉన్న Fungal infection వారు వాడిని టవెల్స్, బట్టలు నుంచి కూడా వ్యాపిస్తుంది .
ప్రత్యేకంగా వేసవిలో ( summer)లేదా ఎండలో ఎక్కువగా శ్రమ పడేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
3) లక్షణాలు ఎలా ఉంటాయి?
Tinea cruris లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. సాధారణంగా కనిపించే లక్షణాలు ఇవి:
* తొడల మధ్య తీవ్రమైన దురద
* ఎర్రగా మారిన చర్మం
* రింగ్ లేదా అర్ధ వలయం లాంటి మచ్చలు
* మచ్చల అంచుల్లో ఎక్కువ ఎరగా ఉండడం
* చర్మం పొడిగా ఊడిపోవడం
* మంట లేదా కాలిపోతున్నట్లుగా అనిపించడం
గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇది సాధారణంగా Private భాగాల మీద కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
4) ఇది సాధారణ మైన సమస్యేన?
చాలామంది దీనిని చిన్న సమస్యగా తీసుకుంటారు. కానీ దీనికి సరైన చికిత్స లేకపోతే ఇది:
* శరీరంలోని ఇతర భాగాలకు పాకుతుంది
* మళ్లీ మళ్లీ తిరిగి వస్తుంది
* దీర్ఘకాలిక సమస్యగా మారవచ్చు
అందుకే ఇది సాధారణం కాదు, నిర్లక్ష్యం చేయకూడదు.
5) ఇంట్లో చేసుకోవాల్సిన జాగ్రత్తలు.
Tinea cruris నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే కొన్ని అలవాట్లను మార్చి కోవాలసి ఉంటుంది:
* రోజూ స్నానం చేసిన తర్వాత గుప్తా భాగాలను పూర్తిగా Dry
అయెలా ఆరబెట్టాలి
* చెమట పట్టిన వెంటనే బట్టలు మార్చుకోవాలి
* Cotton Underwear మాత్రమే వాడాలి
* టైట్ బాటల్ని దూరంగా ఉండండి
* వేరే వాళ్ల టవెల్స్, బట్టలు వాడకూడదు
* దురద ఉన్నాకూడా గోకకూడదు( ఏది చాలా కష్టం కనీ ప్రయత్నించాలి )
6) డాక్టర్ని ఎప్పుడు కలవాలి?
* ఇంటి జాగ్రత్తలు తీసుకున్నా కూడా 1–2 వారాల్లో తగ్గకపోతే
* మచ్చలు ఇంకా పెరుగుతున్నట్టు అనిపిస్తే.
* తీవ్రమైన మంట లేదా నొప్పి ఉంటే
డయాబెటిస్ ఉన్నవారు అయితే
తప్పకుండా Dermatologist నీ సంప్రదించాలి. సరైన పరీక్ష తర్వాత చికిత్స ఇస్తారు.
ముఖ్యమైన అపోహలు( నమ్మరని నమ్మకాలు)
❌ ఇది చెమట వల్ల మాత్రమే వస్తుంది అనుకోవడం
❌ ఏదైనా క్రీమ్ రాసుకుంటే సరిపోతుంది అనుకోవడం
❌ తగ్గగానే మందులు ఆపేయడం
ఇలాంటి అపోహల వల్లే ఈ సమస్య మళ్లీ మళ్లీ వస్తుంది.
చివరిగా…
తొడల మధ్య ఎర్ర మచ్చలు, దురద అనేది చిన్న విషయం కాదు. ఇది మీ జీవనశైలిని, ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. సమయానికి గుర్తించి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది. Shame గా ఉందని, నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ముఖ్యము.
Disclaimer:
ఈ కథనం కేవలం సాధారణ ఆరోగ్య సమాచారానికి మాత్రమే. ఇందులోని వివరాలు వైద్య సలహా గా భావించకండి. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా తగ్గకపోతే తప్పకుండా Eligibility కలిగిన వైద్యులను సంప్రదించండి.
ఆరోగ్యం తెలుగు/ఆరోగ్యం మహాభాగ్యం.