Telegram Join My Telegram   WhatsApp Join My WhatsApp

పిల్లలు సరిగా తినడం లేదని Tension పడుతున్నారా ? 90% తల్లిదండ్రులకు తెలియని నిజం ఇదే!

ప్రతి రోజు చాలా మంది ఇళ్లలో జరిగే సాధారణమైన సీన్.! 

ప్లేట్ ముందు పెట్టగానే పిల్లలు ముఖం తిప్పుకోవడం, ఒక ముద్ద తినిపించడానికి అరగంట పట్టడం, చివరకు కోపం–బలవంతం–తిట్టడం–కొట్టడం– ఏడుపులు. “మా పిల్లలు అసలు తినడంలేదు”, “బలహీనంగా అయిపోతాడేమో” అని తల్లిదండ్రులు భయపడతారు. కానీ నిజం ఏమిటంటే – చాలా సందర్భాల్లో పిల్లలు తినకపోవడం వ్యాధి కాదు, మన చేసే అలవాట్ల ఫలితం. ఇదే 90% తల్లిదండ్రులకు తెలియని నిజం.

1. పిల్లలు తినకపోవడానికి అసలు కారణాలు.

నిజంగా ఆకలి లేకపోవడం
పిల్లలు తినడం లేదంటే వెంటనే “అన్నం నచ్చలేదు” అనుకుంటాం. కానీ చాలా సార్లు పిల్లలకు అకలే ఉండదు. భోజనం మధ్యలో Biscuits, chips, chocolates, juice లు ఇస్తే కడుపు నిండిపోతుంది. అప్పుడు అన్నం చూసి ఆసక్తి ఎందుకు ఉంటుంది?

2. మొబైల్, టీవీ అలవాటు

“Video (Cartoon) పెట్టితే అయినా తింటాడు” అని చాలామంది తల్లిదండ్రులు మొబైల్ చూపిస్తారు. ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. కాని ఇలా తినే పిల్లలకు
* తినే ఆహారం పై దృష్టి ఉండదు
* తినడం ఒక అలవాటుగా మారదు
* ఆకలి మరి తృప్తినీ గుర్తించే శక్తి తగ్గుతుంది

:- దీంతో పిల్లలు స్వయంగా తినే అలవాటు కోల్పోతారు.

3. బలవంతం చేయడం.

“ఆకరి ముద్ద”, “అమ్మ కోసం తిను”, “తినకపోతే బలహీనంగా అవుతావు” – ఇలా చెప్పి తినిపించడం వల పిల్లలో తినడం పట్ల Negative feeling ఏర్పడుతుంది.
తినడం ఒక పోరాటంగా మారితే, పిల్లలు సహజంగానే దూరం పెడుతారు.

4. రుచి మాత్రమే కాకుండా వాతావరణం కూడా ముఖ్యం.


పిల్లలు పెద్ద వాళ్ళని చూసే నేర్చుకుంటారు. ఇంట్లో పెద్దవాళ్లు
* సమయానికి తినకపోయినా
* ఫోన్ చూస్తూ తింటుంటే
* ఆహారం మీద Negative comments చేస్తే.
పిల్లలకి కూడా అదే అలవాటు పడుతుంది.

:- తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పులు.!

*ప్రతి రోజు ఒకే రకమైన భోజనం
అన్నం–పప్పు–కూర… రోజూ ఇదే అయితే పిల్లలకు బోర్ కొట్టడం సహజం.
* పిల్లల్ని ఇతరులతో పోల్చడం
“వాళ్ల అబ్బాయి ఎంత తింటాడో చూడు” “వాళ్లని చూసి నేర్చుకో”  అని పోల్చడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది.
* తినకపోతే భయపడడం
ఒకరోజు లేదా రెండు రోజులు పిల్లలు తక్కువ తింటే వెంటనే భయం పెటాల్సిన అవసరం లేదు. పిల్లల ఆకలి రోజు రోజుకు మారుతుంది.

:-పిల్లలు సరిగా తినాలంటే ఏమి చేయాలి?

1. రోజు ఒకే టైమ్ నీ ఫాలో అవ్వండి.
రోజూ ఒకే Time కి భోజనం ఇవ్వండి. మధ్యలో Junk foods తగ్గించండి. అప్పుడు సహజంగానే ఆకలి పెరుగుతుంది.


2. పిల్లలకి  choice చేసుకొనే  option  ఇవండీ.
“ఈ రోజు ఏ కూర కావాలి?” అని అడగండి. Kitchen లో చిన్న చిన్న పనుల్లో సహాయం చేయనివ్వండి. పిల్లలు తాము ఎంచుకున్న ఆహారాన్ని ఆనందంగా తింటారు.
3. తినడం ఒక హ్యాపీ టైమ్ గా మార్చండి.
భోజనం చేసే Time లో Mobile, TV కి దూరంగా పెట్టండి. కుటుంబం అంతా కలిసి తినడం అలవాటు చేసుకోండి . మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ తింటే పిల్లలకు Positive feeling వస్తుంది.


4. కొద్ది కొద్ది గా ప్రారంభించండి.
పెద్ద ప్లేట్ నిండా ఒకేసారి పెట్టకుండా, చిన్న చిన్న మోతాదులో పెట్టండి. అయిపోతే పిల్లలు మళ్లీ అడుగుతారు. ఇది మంచి సంకేతం.


5. బలవంతం వద్దు.
పిల్లలు తినకపోతే కోప్పడకుండా శాంతంగా ప్లేట్ తీసేయండి. తదుపరి భోజనం సమయానికి ఆకలి తప్పకుండా వేస్తుంది.

:-నిజంగా ఎప్పుడు డాక్టర్‌ కు చూపించాలి?

* పిల్లలు చాలా రోజులుగా తినకపోతే
* బరువు ఎక్కువగా తగిపోయినపుడు
* ఎప్పుడూ నేరసంగా ఉంటే
* వాంతులు, డయేరియా, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే
అప్పుడు మాత్రంమే డాక్టర్ లా సలహా అవసరం.

:-చివరిగా గుర్తుంచుకోవాల్సిన నిజం.


పిల్లలు తినకపోవడం చాలా సందర్భాల్లో తాత్కాలిక సమస్య మాత్రమే. ప్రేమ, ఓర్పు, సరైన అలవాట్లు ఉంటే ఈ సమస్య స్వయంగా తగ్గిపోతుంది.
తినడం ఒక శిక్షలా కాకుండా, సంతోషంగా చేసే అలవాటుగా మార్చడమే తల్లిదండ్రుల అసలు బాధ్యత.

👉 గుర్తుంచుకోండి: పిల్లలు ఎంత తింటున్నరు, అనేకన్నా ఎలా తింటున్నారు అనేదే ముఖ్యం.

       “ఆరోగ్యం తెలుగు” 

Leave a Comment