Telegram Join My Telegram   WhatsApp Join My WhatsApp

చిన్న వయసులోనే White hair నా? నిర్లక్ష్యం చేస్తే జుట్టు రాలడం ఖాయం.! డాక్టర్లు చెప్పిన నిజం ఇదే..!

సాధారణంగా వయస్సు పెరిగేకొద్దీ జుట్టు తెల్లబడటం సహజం. కానీ ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు, టీనేజర్లు, యువతలో కూడా తెల్ల జుట్టు కనిపించడం ఆందోళన కలిగించే విషయం. తెల్ల జుట్టు రావడానికి కారణం జుట్టుకు రంగు ఇచ్చే మెలనిన్ (Melanin) అనే పదార్థం తగ్గిపోవడం వల్ల జుట్టు తెల్లగా మారుతుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే క్రమంగా Hair fall కూడా మొదలవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

చిన్న వయసులో White Hair రావడానికి ప్రధాన కారణాలు. ఇవే .

1. పోషక లోపాలు (Nutritional Deficiency):
విటమిన్ B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాపర్ లోపం వల్ల జుట్టు తెల్ల బడుతుంది. పిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఈ లోపాలు వస్తున్నాయి.

2. జీన్స్ కారణాలు (Genetics):
తల్లిదండ్రులు లేదా కుటుంబంలో ఎవరికైనా చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఉంటే, పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఎక్కువ.

3. ఒత్తిడి (Stress):
పిల్లల్లో కూడా చదువు అనే  ఒత్తిడి, Mobile Addiction, నిద్ర సరిగా లేకపోవడం వల్ల Stress పెరుగుతోంది. ఇది జుట్టు ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది.

4. థైరాయిడ్ సమస్యలు:
Hypothyroidism లేదా హైపర్ Thyroidism ఉన్నవారిలో జుట్టు తెల్లబడటం,కానీ రాలడం కానీ సాధారణం.

5. కెమికల్ (chemical) షాంపూలు & సబ్బులు:
చిన్న పిల్లలకి కూడా పెద్దవల షాంపూలు వాడటం వల్ల Scalp దెబ్బతిని జుట్టు తెల్లగా మారిపోతుంది.

White Hair ని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?

చాలామంది “తెల్ల జుట్టే కదా” అని వదిలేస్తారు. కానీ ఇది శరీరంలో ఉన్న లోపాలకు సంకేతం కావచ్చు. సమస్యను చినగునపుడే పట్టించుకోకపోతే:

  • జుట్టు రాలడం పెరుగుతుంది
  • జుట్టు పలుచగా మారుతుంది
  • కొత్త జుట్టు పెరగడం తగ్గుతుంది
  • Scalp బలహీనంగా మారిపోతుంది

డాక్టర్ల ప్రకారం, White Hair + Hair Fall కలిసి రావడం వెనుక ప్రధానంగా పోషక లోపాలు, హార్మోన్ల సమస్యలు ఉంటాయి.

పిల్లల్లో White Hair తగ్గించేందుకు డాక్టర్లు చెప్పే కొని సూచనలు:

1. సమతులనా  మైన ఆహారం ఇవ్వాలి:
పాలకూర, కరివేపాకు, గుడ్లు, పాలు, పెరుగు, ఖర్జూరం, బాదం లాంటి ఆహారం తప్పనిసరి.

2. జంక్ ఫుడ్ తినడం తగ్గించాలి:
చిప్స్, బర్గర్లు, కూల్ డ్రింక్స్ పిల్లల జుట్టుకు శత్రువులు.

3. సరైన నిద్ర తప్పనిసరి:
రోజుకు కనీసం 8 గంటల నిద్ర వల్ల పిల్లల hormones బ్యాలెన్స్ కు అవసరం.

4. ఆయిల్ మసాజ్ :
కొబ్బరి నూనె, బాదం నూనె లేదా నల్ల నువ్వుల నూనెతో వారానికి 2 సార్లు మసాజ్ చేసుకుంటే మంచిదీ.

5. డాక్టర్ సలహా తీసుకోవాలి:
తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే తప్పకుండా Pediatrician లేదా Dermatologist సంప్రదించాలి.

హెయిర్ ఫాల్‌ ని ఎలా నివారించాలి?

  • గట్టిగా జుట్టు కట్టకూడదు
  • తడి జుట్టును దువ్వకూడదు
  • పిల్లలకు కెమికల్ Hair oil,dyes వాడకూడదు
  • అవసరమైతే రక్త పరీక్షలు చేయించాలి

ముగింపు.

చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం చిన్న సమస్య కాదు. ఇది శరీర ఆరోగ్యంపై హెచ్చరిక కావచ్చు. సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే White Hair తో పాటు Hair Fall సమస్యను కూడా నివారించవచ్చు. పిల్లల జుట్టు ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఇప్పుడే అప్రమత్తం కావాలి.

ఆరోగ్యం మహాభాగ్యం

డిస్క్లైమర్:

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పిల్లల్లో జుట్టు సమస్యలు ఎక్కువగా ఉంటే తప్పకుండా Eligibility గల డాక్టర్‌ని సంప్రదించాలి.

Leave a Comment