Telegram Join My Telegram   WhatsApp Join My WhatsApp

కేవలం ₹20 రూపాయలతో సంవత్సరానికి ₹2 లక్షల భాగ్యం !

ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY)

ప్రధాన్ మంత్రి సురక్షా బీమా యోజన (Pradhan Mantri Suraksha Bima Yojana – PMSBY) అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన ఒక అత్యంత తక్కువ Premium ప్రమాద బీమా పథకం. ఈ పథకం ద్వారా ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు బాధిత కుటుంబానికి ఆర్థిక భద్రత అందుతుంది.

నేటి రోజుల్లో రోడ్డు ప్రమాదాలు, పని ప్రదేశాల్లో ప్రమాదాలు, అకస్మాత్తు గాయాలు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబానికి పెద్ద దెబ్బ తగులుతుంది. ముఖ్యంగా కుటుంబాన్ని పోషించే వ్యక్తికి ఏదైనా జరిగితే, ఆ కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుంది. అలాంటి సమయంలో PMSBY పథకం ఒక రక్షణ కవచంలా(protection) పనిచేస్తుంది.

ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

సాధారణ ప్రజలకు(middle class) తక్కువ ఖర్చుతో ప్రమాద బీమా రక్షణ ఇవ్వడం.

ఖరీదైన insurance policy లు తీసుకోలేని పేద, మధ్యతరగతి ప్రజలు కూడా కేవలం ₹20 చెల్లించి ఈ పథకం ద్వారా రక్షణ పొందవచ్చు. అందుకే ఈ పథకాన్ని “పేదల బీమా పథకం” అని కూడా అంటారు.

ప్రీమియం(premium) వివరాలు:

PMSBY పథకం ప్రత్యేకత ఏమిటంటే – ఉన్న Premium తో పోలిస్తే అతి తక్కువ Premium ఇదే.

  • సంవత్సరానికి ప్రీమియం: కేవలం ₹20 మాత్రమే
  • ఇది ఒక్కసారి మాత్రమే చెల్లించాలి
  • నెలవారీ చెల్లింపులు అవసరం లేదు.

₹20 అంటే నెలకు కొన్ని ₹1.66 పైసలు మాత్రమే . అంత తక్కువ ఖర్చుతో ఇంత పెద్ద భద్రత కల్పించే పథకం ఇదే.

ఈ బీమా ద్వారా మీకు దొరికే  కవరేజ్ (Coverage Amount)

ఈ పథకం కింద మీకు ఏదైనా ప్రమాదం జరిగితే కింద సూచించిన విధంగా బీమా మొత్తం అందుతుంది.

1) ₹2 లక్షలు అందేది:

  • ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు
  • పూర్తిస్థాయి శాశ్వత వైకల్యం (Total Permanent Disability) వచ్చినప్పుడు
  • రెండు కళ్ల చూపు పూర్తిగా పోవడం వల్ల
  • రెండు చేతులు లేదా రెండు కాళ్లు కోల్పోవడం
  • ఒక చేయి మరియు ఒక కాలు కోల్పోవడం తో

ఈ 2 లక్షల కవరేజ్ పొందొచ్చు.

2) ₹1 లక్ష అందేది:

  • భాగశాశ్వత వైకల్యం (Partial Permanent Disability) వచ్చినప్పుడు
  • ఒక కన్ను చూపు కోల్పోవడం
  • ఒక చేయి లేదా ఒక కాలు కోల్పోవడం.

ఈ మొత్తం నేరుగా నామినీకి ( nominee)లేదా బాధితుడికి చెల్లించబడుతుంది.

అర్హత (Eligibility):

ఈ పథకం పొందాలంటే అర్హత చాలా సులభం:

  • వయస్సు 18 నుండి 70 సంవత్సరాల మధ్య ఉండాలి
  • Bank లేదా post office లో saving అకౌంట్ ఉండాలి
  • ఆధార్ లింక్ అయి ఉండటం మంచిది
  • ఒక్క వ్యక్తి ఒక్క PMSBY పాలసీ మాత్రమే తీసుకోవచ్చు
  • భారత పౌరుడు అయి ఉండాలి

దేశంలోని దాదాపు ప్రతి సాధారణ వ్యక్తి ఈ పథకానికి అర్హుడే.

పాలసీ కాలవ్యవధి(policy time period):

PMSBY ఒక సంవత్సర కాలం మాత్రమే చెల్లే బీమా పథకం.

  • ప్రతి సంవత్సరం జూన్ 1 కి లోపు
  • ₹20 మొత్తం నీ
  • మీ bank లేదా post office seving  account  నుంచి
  • ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.

కావున ప్రతి సంవత్సరం మళ్లీ ఫారం ( form )నింపాల్సిన అవసరం ఉండదు.

ఈ పథకం లాభాలు:

* అత్యంత తక్కువ ప్రీమియం
1) ప్రభుత్వ పథకం – పూర్తి భద్రత
2) ప్రమాదం శతు మరణం & వైకల్యానికి రక్షణ
3)  బ్యాంక్ / పోస్టాఫీస్ ద్వారా సులభంగా చేరిక
4)  గ్రామీణ మరియు పట్టణ ప్రజలకు సమానంగా ఉపయోగపడే పథకం

ఈ పథకం ఆరోగ్య బీమా కాదు.
ఇది కేవలం ప్రమాదాల వల్ల జరిగే మరణం లేదా వైకల్యంకే వర్తిస్తుంది.
సహజ మరణాలు లేదా వ్యాధుల వల్ల కలిగే మరణాలకు ఈ పథకం వర్తించదు.

ముఖ్య గమనిక (Disclaimer):

ముగింపు.

Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) అనేది ప్రతి భారతీయుడు తప్పకుండా తీసుకోవాల్సిన పథకం. కేవలం ₹20 రూపాయిలు పెట్టి ₹2 లక్షల భద్రత పొందడం అంటే నిజంగా గొప్ప అవకాశం. మీరు ఇంకా ఈ పథకం తీసుకోకపోతే, వెంటనే మీ బ్యాంక్ లేదా post office ని సంప్రదించి ఈ పథకం  పొందండి.

ఎలాంటి మరి కొని updates కోసం

ఆరోగ్యం తెలుగు డాట్ ఇన్.

సందర్శించండి..

Leave a Comment